ETV Bharat / entertainment

అలా చేసేందుకు తమన్నా గ్రీన్​సిగ్నల్​.. షాకైన​ స్టార్ యాక్టర్​!

author img

By

Published : Dec 9, 2022, 12:42 PM IST

హీరోయిన్​ తమన్నా అలా చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిందని తెలియగానే ఆ స్టార్ యాక్టర్​ షాక్ అయ్యారట. ఆ వివరాలు..

Gurutnda seetakalam satyadev about tamannah
అలా చేసేందుకు తమన్నా గ్రీన్​సిగ్నల్​.. షాకైన​ స్టార్ యాక్టర్​

'చాంద్‌ సా రోషన్‌ చెహ్రా' అనే బాలీవుడ్‌ సినిమాతో 2005లో తెరంగేట్రం చేశారు హీరోయిన్​ తమన్నా. అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమమ్యారు. 'హ్యాపీడేస్‌'తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత స్టార్​ హీరోల సినిమాల్లో నటిస్తూ ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్​లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఆమె స్టార్ హీరోయిన్​గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆమె.. ఇప్పుడిప్పుడే స్టార్​ యాక్టర్​గా ఎదుగుతున్న నటుడు సత్యదేవ్​తో కలిసి ఓ చిన్న సినిమాలో నటించారు. అదే 'గుర్తుందా శీతాకాలం'. డిసెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్​కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్​.. తమన్నా గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇంకా చిత్ర విశేషాలను తెలిపారు.. ఆ వివరాలు..

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు హీరో సత్యదేవ్‌. ఇటీవలే గాడ్‌ఫాదర్‌లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు హీరోగా గుర్తుందా శీతాకాలంతో పలకరించారు. కన్నడలో విజయవంతమైన లవ్‌ మాక్‌టైల్‌కు రీమేక్‌గా రూపొందింది. నాగశేఖర్‌ తెరకెక్కించారు. ఆ సినిమా గురించి సత్యేదేవ్​ మాట్లాడుతూ.. "ఈ ఏడాదిలో నా నుంచి వస్తున్న ఐదో చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి అన్నయ్య ముందే చెప్పినట్లుగా గాడ్‌ఫాదర్‌ చిత్రంతో ద్వారా నేను మరింత మందికి చేరువయ్యా. ఇలాంటి తరుణంలో గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేనిందులో దేవ్‌ అనే పాత్రలో కనిపిస్తా. అతని జీవితంలోని నాలుగు ప్రేమకథల్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇలాంటి సినిమా నేనిప్పటి వరకు చేయలేదు. తమన్నా పాత్ర ప్రవేశించాక ఈ చిత్ర స్వరూపమే మారిపోతుంది". అని అన్నారు.

Gurutnda seetakalam satyadev
నటుడు సత్యదేవ్

"ఒక చిత్రంలో మూడు భిన్న వయసులున్న పాత్ర చేసే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకుల్ని ఒప్పించడానికి ఈ పాత్రల కోసం చాలా కష్టపడ్డా. తమన్నా ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుందని తెలియగానే షాకయ్యా. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తుంది. ఇది కన్నడ చిత్రానికి రీమేక్‌ అయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మంచి మార్పులు చేశాం. ప్రేమకథా చిత్రాలు విశ్వజనీనమైనవి. అవి ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్య వచ్చిన 'సీతారామం', 'లవ్‌టుడే' వంటి చిత్రాల్ని ఆదరించినట్లే.. మా సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నా".

"నేను ప్రస్తుతం 'కృష్ణమ్మ', 'ఫుల్‌ బాటిల్‌' చిత్రాలు చేస్తున్నా. డాలీ ధనంజయతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చేస్తున్నా. ఇవి కాకుండా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి".

"ఏ చిత్రం చేసినా.. విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే చేస్తాము. ప్రతి సినిమాకీ ఒకే రీతిలో కష్టపడతాం. నా స్థాయి పెంచుకోవాలంటే ఇప్పుడు నేనొక పెద్ద థియేట్రికల్‌ హిట్‌ అందించాలి. 'గాడ్సే'పై చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ, నా అంచనాలకు విరుద్ధంగా జరిగింది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. నేను ఆశావాద దృక్పథంతోనే జీవిస్తుంటా. ఈ చిత్ర విడుదల విషయంలో చాలా ఆలస్యం జరిగింది. అది నాకు సహనంగా ఎలా ఉండాలో నేర్పింది".

ఇదీ చూడండి: అర్ధరాత్రి నయనతారను భయపెట్టిన డెవిల్​.. వీడియో పోస్ట్​ చేసిన ప్రభాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.