ETV Bharat / entertainment

చిరుతో పాన్ వరల్డ్​ మూవీ.. కిక్ ఇచ్చేలా బాలయ్య ఆన్సర్​.. వెంకీ​-బన్నీతో కష్టాలంటా!

author img

By

Published : Dec 1, 2022, 1:33 PM IST

Updated : Dec 1, 2022, 2:19 PM IST

అన్‌స్టాపబుల్‌ 2 టాక్‌ షోతో ఓటీటీ ప్రేక్షకులను ప్రతి వారం అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమ తాజా ఎపిసోడ్‌కు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ అతిథులుగా వచ్చారు. వారంతా పంచుకున్న పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. ఈ కార్యక్రమం తాజా ప్రోమో మీరూ చూసేయండి.

Balakrishna comments on movie with chiranjeevi
చిరంజీవితో కలిసి పాన్ వరల్డ్​ సినిమా.. మనసులో మాట చెప్పిన బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో స్ట్రీమింగ్​ అవుతున్న అన్​స్టాపబుల్​ క్రేజ్​ గురించి తెలిసిందే. బాలయ్య క్రేజ్​ను మరింత పెంచింది. ప్రస్తుతం రెండో సీజన్​ కూడా విశేష ఆదరణతో కొనసాగుతోంది. ఈ సారి తాజా ఎపిసోడ్​కు డైరెక్టర్ రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్‌ బాబులను అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

'తెలుగు సినిమా'కు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు. 'తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టిన వాళ్లు. సినిమానే ప్రపంచంగా పెరిగిన వాళ్లు. ఇవాళ మన నిర్మాతలు' అని బాలయ్య బాబు వారిని పరిచయం చేయగా... అల్లు అరవింద్, సురేష్ బాబు స్టేజ్‌పైకి వచ్చారు. వెంటనే బాలయ్య బాబు తన హ్యూమర్‌తో అందరినీ నవ్వించారు.

'నాకు మీ ఇద్దరినీ చూస్తుంటే... భలే దొంగ,మంచి దొంగ ఇలాంటి దొంగ సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయి' అంటూ సెటైర్ వేశారు. దీనికి సురేష్ బాబు 'కథానాయకుడు లాంటి మంచి సినిమాలు చెప్పొచ్చుగా' అని నవ్వుతూ బదులిచ్చారు. సురేష్ బాబుతో తాను ఆల్రెడి సినిమాలు చేశానని, మన కాంబినేషనే బ్యాలెన్స్ ఉందని బాలకృష్ణ అల్లు అరవింద్‌తో సంభాషణలు సాగదీశారు. వెంటనే అల్లు అరవింద్ దీనికి ఆదిరిపోయే బదులిచ్చారు. 'మీరు, చిరంజీవిని కలిపి సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నాను' అని ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే సమాధానమిచ్చారు. దానికి బాలయ్య సానుకూలంగా స్పందిస్తూ.. 'అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందప్పుడు' అని పంచ్ వేశారు.

వెంకీ బన్నీతో చెప్పుకోలేని కష్టాలు.. సురేష్ బాబు గురించి చెబుతూ అల్లు అరవింద్ 'ఆయన వెజిటేరియన్' అని అనగా... బాలయ్య అందుకుని 'అంటే మీలో ఉన్న మ్యూజిక్ ఆయనలో లేదా' అంటూ నవ్వులు పూయించారు. ఇదే సమయంలో వెంకీ, బన్నీల ప్రస్తావనా తీసుకొచ్చారు బాలయ్య. 'వాళ్లతో ఎలా వేగుతున్నారు' అని ప్రశ్నించగా...'చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయ్' అని ఫన్నీగా బదులిచ్చారు అల్లు అరవింద్. తెలుగు సినిమా ప్రత్యేకతేంటి అని ఆసక్తికర ప్రశ్న అడిగారు బాలయ్య. దీనికి సురేష్ బాబు 'తెలుగు సినిమా థాలీ మీల్స్ లాంటిది' అని ఆన్సర్ ఇచ్చారు.

యాపిల్​ ఎక్కడ వేయాలో కనుకున్నా.. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు స్టేజ్ మీదకు వచ్చీ రాగానే పంచ్ వేశారు. 'జీవితమంతా ఈ ఇద్దరి మధ్యనే శాండ్‌విచ్‌ అయి ఉన్నాను. మళ్లీ ఇక్కడ కూడా వీళ్లేనా' అంటూ నవ్వించారు. 'రాఘవేంద్ర రావు బీఏ అంటే ఏంటో తెలుసా. బొడ్డు మీద యాపిల్ అని అర్థం' అని అల్లు అరవింద్ కామెడీ చేశారు. అయితే రాఘవేంద్ర రావు కూడా తిరిగి పంచ్‌ల మీద పంచ్‌లు వదిలారు. 'న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను' అంటూ ఫన్నీగా కితకితలు పెట్టించారు.

నెపోటిజం గురించీ బాలయ్య ప్రశ్నించగా...'ఇది చెప్పినందుకు నన్ను తప్పకుండా ట్రోల్ చేస్తారు' అని అల్లు అరవింద్ అన్నారు. మరి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రోమో చివర్లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలయ్య బాబు 'జోహార్ ఎన్టీఆర్' అంటూ నివాళి అర్పించారు. ఓ స్పెషల్ సాంగ్ కూడా రూపొందించారు. ఆ ప్రోమోను మీరు చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కలర్​ ఫొటో డైరెక్టర్​​ కథతో విశ్వక్​ సేన్​ కొత్త సినిమా.. థ్రిల్లింగ్​గా ట్రైలర్

Last Updated :Dec 1, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.