ETV Bharat / entertainment

బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ సినిమాతోనే!

author img

By

Published : Oct 19, 2022, 4:05 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్​ నగర్​లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన బాలీవుడ్ ఎంట్రీ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సంగతులు..

Balakrishna Bollywood entry
బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ సినిమాతో!

అఖండ విజయంతో జోరు మీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఎన్‌బీకే 107 షూటింగ్‌ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. గోపిచందర్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. దీని తర్వాత ఆయన అనిల్​రావిపూడి దర్శత్వంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. ఇప్పటి వరకు ఆయన కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేశారు. అయితే ఇప్పుడాయన తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ద్వారా బాలయ్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లోనూ రూపొందనుందని.. అలానే దీన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం హిందీలో పేరున్న నటీనటులను తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నారట. కథానాయికను కూడా హిందీ నుంచి తీసుకు వస్తే ఎలా ఉంటుంది? అని అనుకుంటున్నారట! కాగా, మొదట ఈ చిత్రం కోసం అనిల్ రావిపూడి త్రిషను హీరోయిన్​గా తీసుకుందామని భావించారట. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్​ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనిల్​ బీటౌన్​ భామలపై ఫోకస్​ పెట్టినట్లు తెలిసింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, అనిల్‌ రావిపూడి.. తెలుగులో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే మహేశ్​ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి.. బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన బాలయ్యతో సినిమా అనౌస్స్‌ చేయడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్​ సంగీతం అందిస్తున్నారు. అంజలి, ప్రియమణి కీలక పాత్రలను నటిస్తున్నారని.. అలానే యంగ్‌ బ్యూటీ శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: ఆదిపురుష్​ డైరెక్టర్​కు గిఫ్ట్​గా లగ్జరీ కారు.. వామ్మో అన్ని కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.