ETV Bharat / entertainment

'కాంతార' హీరోను చూస్తుంటే అసూయగా ఉంది: బాలీవుడ్ స్టార్​

author img

By

Published : Dec 12, 2022, 2:38 PM IST

కాంతార హీరో రిషబ్​శెట్టిని చూస్తుంటే అసూయగా ఉందని అన్నారు ఓ బాలీవుడ్ స్టార్​ యాక్టర్​. అలాగే సౌత్​ సినిమాలను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్​ చేశారు మరో బీటౌన్​ స్టార్ డైరెక్టర్​. ఏం అన్నారంటే..

nawazuddin comments on Rishab shetty
'కాంతార' హీరోను చూస్తుంటే అసూయగా ఉంది: బాలీవుడ్ స్టార్​

'కాంతార' ఫేమ్​ హీరో రిషబ్‌శెట్టిని చూస్తే తనకు అసూయగా ఉందని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ''ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు అసూయ రావడం సర్వసాధారణం. పోటీ పెరిగిందనే భావన కలుగుతుంది. అతడి విషయంలోనూ అదే ఉంది. ఎంతో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. కష్టపడి పనిచేసి అతడిలా మంచి విజయాన్ని అందుకోవాలనిపించింది'' అని నవాజుద్దీన్‌ తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి.. నవాజుద్దీన్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. ''ఆయన నటించిన ఎన్నో చిత్రాలు చూశాను. శ్రమించే గుణం, ఎన్నో కష్టాలతో ఆయన ప్రయాణం సాగింది. ఆయన కూడా మాలాంటి వ్యక్తే. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మేమంతా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకోవాలని అనుకుంటాం. ఆయన ఎంతోమందికి గొప్ప స్ఫూర్తి. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో చిన్న పాత్రలు పోషించారు. నేను కూడా ఘన విజయాన్ని రుచి చూడటానికి ముందు చిన్న చిన్న పాత్రలు పోషించాను. కాబట్టి, మా ఇద్దరి ప్రయాణం ఒకటే'' అని రిషబ్‌శెట్టి వివరించారు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ సైతం 'కాంతార' టీమ్‌ను మెచ్చుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు. రిషబ్‌శెట్టి మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

కాపీ కొడితే అలానే ఉంటుంది.. మరోవైపు ప్రస్తుతం సౌత్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న విషయమై స్పందించారు బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్ కశ్యప్​. ఆయన చేసిన కామెంట్స్​ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాయి. దక్షిణాది సినిమాలను ఉద్దేశిస్తూ.. సౌత్‌ సినిమాలను కాపీ కొట్టి తీస్తే బాలీవుడ్‌లో ఎప్పటికీ విజయవంతమైన సినిమాలు రావని ఆయన అన్నారు. బాలీవుడ్‌లో అందరూ పాన్‌ ఇండియా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని.. అది సరైన పద్ధతి కాదని.. బలమైన కథలను రూపొందించాలని సూచించారు.

"ఇటీవల కాలంలో కాంతార, పుష్ప లాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. బాలీవుడ్‌లో వాటిని అనుకరిస్తూ సినిమాలు తీస్తే అవి డిజాస్టర్‌ అవుతాయి. ఇలాంటి ప్రయత్నాలే బాలీవుడ్‌కు భారీ నష్టాలు తెస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్‌ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్‌ అవుతాయి" అని అనురాగ్ అన్నారు.

ఇదీ చూడండి: Unstoppable బాలయ్యతో కలిసి ప్రభాస్​ గోపిచంద్​ రచ్చ రచ్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.