ETV Bharat / entertainment

'యాంకరింగ్​కు గుడ్​బై.. ఇక ఫ్యామిలీకే అంకితం'.. సుమ బిగ్ ట్విస్ట్

author img

By

Published : Jan 1, 2023, 11:04 AM IST

ఇటీవలే యాంకర్​ సుమ ఓ షాకింగ్​ నిర్ణయాన్ని ప్రకటించారు. తాను ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉండాలనుకుంటున్నానని ఓ షో ప్రోమోలో తెలిపారు. అయితే కొన్ని రోజులకే మళ్లీ ఆ మాటలు నిజం కావని ఓ ట్వీట్​ పోస్ట్​ చేశారు. కాసేపటికే దాన్ని కూడా డిలీట్ చేశారు. చివరకు.. తన రిటైర్మెంట్​పై తాజాగా ఓ షోలో క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ??

Etv Bharat
Etv Bharat

క్యాష్​ వేర్​ ఈజ్​ ద పార్టీ షో

యాంకరింగ్​కు ఇక సెలవు అని ప్రముఖ యాంకర్​ సుమ చెప్పిన మాటలు ఇటీవల నెట్టింట దుమారం రేపాయి. 15 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం మాటల చతురతతో, కామెడీతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయిన సుమ ఇక రిటైర్​ అవ్వనున్నారన్న వార్త తెలియగానే ఎందరో అభిమానులు బాధపడ్డారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా సుమనే వెల్లడించారు.

న్యూ ఇయర్​ వేడుకలను సెలబ్రేట్​ చేసేందుకు ఈటీవీ 'వేర్ ఈజ్ ది పార్టీ' పేరుతో ఓ స్పెషల్ షోను ప్రసారం చేసింది. ఇందులో టీవీ పరిశ్రమకు చెందిన ఆర్టిస్టులందరూ ఒక్కచోట చేరి సంబరాలు చేసుకున్నారు. మ్యూజిక్​, డ్యాన్స్ ఇలా ఒకటా రెండా.. పార్టీలో ఏదీ లోటు ఉండకూడదని అన్నీ చేశారు. ఈ షోకు యాంకర్​గా సుమ వచ్చి సందడి చేశారు. ఎప్పటిలాగే తన డైలగ్​ డెలివరీతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. అయితే అసలు విషయం ఇప్పడే ఆరంభమైంది. షో చివర్లో సుమ ఓ సర్ప్రైజ్​ ఉన్నట్లు చెప్పుకొస్తున్న సమయంలో జబర్దస్త్​ ఫేమ్​ హైపర్​ ఆది ఓ మాట అన్నాడు. 'ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న మీకు మా అందరి తరఫున ఓ చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం' అని చెప్తూ అందరూ కలిసి సుమను సత్కరించారు. ఆ తర్వాత సుమతో తమకున్న అనుబంధాన్ని అక్కడున్న ఆర్టిస్టులందరూ ఒక్కొక్కరుగా చెప్పుకొచ్చారు.

అంతా బాగానే ఉందన్న సమయంలో సుమ ఓ షాకింగ్​ నిర్ణయం తెలిపారు. మలయాళీ అయినా తనను ఇంతలా ప్రేమించి, ఆదరించారని, కానీ ఇప్పుడు విరామం తీసుకుంటున్నాను అని సుమ చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నేళ్లు ఇండస్ట్రీకే పరిమితమైన తను కొంత గ్యాప్​ తీసుకుని ఫ్యామిలీతో కలిసి స్పెండ్​ చేయాలనుకుంటున్నానని తెలిపారు. "మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే.. అది కేవలం తెలుగు వాళ్లు ఇచ్చిన అభిమానం, ప్రేమ. వాళ్లు లేకపోతే నేను లేను. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలనుకుంటున్నాను" అని సుమ అన్న వెంటనే అక్కడున్నవారంతా షాక్​కు గురయ్యారు. అలా కంట తడి పెట్టుకున్న కాసేపటికి..'ఒక వేళ నిజంగా ఇలాంటి రోజు వస్తే నేను తట్టుకోలేను కాబట్టి ఈ విరామం 2022కు మాత్రమే తీసుకుంటున్నా' అని బదులిస్తూ తన న్యూ షో ప్రోమోను రిలీజ్​ చేశారు. ఇక ఎంతో మంది అభిమానించే 'క్యాష్​' షోకు కొంత విరామం ఇస్తామని తెలిపిన సుమ అంత వరకు తన కొత్త షో 'సుమ అడ్డా'ను చూసి ఎంజాయ్​ చేయాలని కోరారు.

దీంతో అంతసేపు షాక్​లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. రీసెంట్​గా ఈ షో ప్రోమోలో తన రిటైర్మెంట్​కు సంబంధించిన క్లిప్​ను చూసిన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేందుకు సుమ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ సైతం పెట్టారు. ఆ తర్వాత వెంటనే డిలీట్​ చేశారు. దీంతో తన రిటైర్మెంట్​ ఇక ఖాయం అని అభిమానులు బలంగా నమ్మారు కానీ వాటన్నింటికీ ఈ షోలో చెక్​ పెట్టారు యాంకర్​ సుమ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.