ETV Bharat / crime

Buffalo: బర్రె తోక మెడకు చుట్టుకుని వ్యక్తి మృతి.. కానీ...??

author img

By

Published : Aug 15, 2021, 4:07 PM IST

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలో ఓ వ్యక్తి గేదెతో చేసిన ఆకతాయితనం అతని ప్రాణాన్నే తీసింది. బర్రె తోక మెడకు చుట్టుకొని ఊపిరాడక చనిపోయిన ఘటన కాలనీవాసుల్లో పలు రకాల చర్చకు దారితీసింది.

బర్రెపై అత్యాచారం
బర్రెపై అత్యాచారం

బర్రె (Buffalo) తోక మెడకు చుట్టుకుని వ్యక్తి మరణించిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలోని నాగవరంలో చోటుచేసుకుంది. వనపర్తి పట్టణం బండారు నగర్​కు చెందిన దేశీ ఆంజనేయులు.. శనివారం తెల్లవారుజామున నాగవరం వైపు వెళ్తుండగా.. గుమ్మడం బాల్​రెడ్డి ఇంటి వద్ద గేదె కనిపించింది. దాని తోకను ఆడించే క్రమంలో ఆయన మెడకు బిగుసుకుంది. భయాందోళన గురైన గేదె.. వడివడిగా అటూఇటూ కదలడం వల్ల అతని మెడకు తోక మరింతగా బిగుసుకుని ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు.

గేదె అరుపులతో బయటకు వచ్చిన కాలనీవాసులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై షేక్​ షఫీ, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంటిపై బట్టలు లేకుండా ఆంజనేయులు ఉన్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో అనుకోకుండా దాని తోక ఆంజనేయులు మెడకు చుట్టుకొని ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

మరోవైపు.. ఆంజనేయులు మానసిక పరిస్థితి సైతం సరిగా లేక.. భార్య పిల్లల్ని వదిలేసి గతకొంత కాలంగా జంతువులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు అతన్ని మందలించినట్లు సైతం తెలుస్తోంది. శనివారం ఆంజనేయులు.. అదే విధంగా ప్రయత్నించడం వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.