ETV Bharat / city

విశాఖ ఆర్కే బీచ్​లో కొనసాగుతున్న బీచ్ వాలీబాల్ పోటీలు

author img

By

Published : Dec 17, 2019, 5:46 PM IST

The Continental Cup Beach Volleyball Tournament in vishakha rk beach
నువ్వా నేనా అంటూ సాగుతున్న బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖ ఆర్కే బీచ్​లో నిర్వహిస్తోన్న కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈనెల 16 నుంచి ప్రారంభమైన ఈ పోటీలు... రేపటితో ముగుస్తాయి.

నువ్వా నేనా అంటూ సాగుతున్న బీచ్ వాలీబాల్ పోటీలు

సాగర తీరం విశాఖలో కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మన దేశంతో పాటు శ్రీలంక, కజకిస్థాన్, ఇరాన్ దేశాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం ఆరు దేశాలు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ పాకిస్థాన్​, బంగ్లాదేశ్​లు పోటీలకు దూరంగా ఉన్నాయి. మూడు రోజులపాటు జరుగనున్న పోటీలు రేపటితో ముగియనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులను ఒలింపిక్స్ జోనల్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి:

విశాఖలో ఉత్సాహంగా రోలర్​ స్కేటింగ్​ పోటీలు

Intro:Ap_Vsp_63_17_Beach_Volly_Ball_Poteelu_Ab_AP10150


Body:సుందర సాగర తీరం విశాఖలో కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు కనువిందు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఇండియా శ్రీలంక కజకిస్తాన్ ఇరాన్ దేశాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు మొత్తం ఆరు దేశాలు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు ఈ ఫోటోలు పాల్గొనలేదు దీంతో నాలుగు దేశాల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి రేపు ముగింపు పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఒలింపిక్స్ జోనల్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
---------
బైట్ జి నారాయణ రాజు ఆంధ్ర ప్రదేశ్ బీచ్ వాలీబాల్ సంఘం కార్యదర్శి
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.