ETV Bharat / city

విశాఖలో ఉత్సాహంగా రోలర్​ స్కేటింగ్​ పోటీలు

author img

By

Published : Dec 17, 2019, 1:07 PM IST

విశాఖ వేదికగా రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. పోటీలు వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు.

roller skating compitisions at vizag
విశాఖలో ఉత్సాహంగా రోలర్​ స్కేటింగ్​ పోటీలు

ఉత్కంఠభరితం.. రోలర్​ స్కేటింగ్​ పోటీలు

విశాఖలో జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలు రెండో రోజూ ఉత్సాహంగా జరిగాయి. వుడా పార్కు రింక్‌ల వద్ద "స్పీడ్‌ హాకీ" పోటీలు సాగుతుండగా... శివాజీ పార్కు రింక్ వద్ద ఆర్టిస్టిక్ పోటీలు జరిగాయి. ఆయా విభాగాల్లో క్రీడాకారులు పాల్గొని.. తమదైన ప్రతిభతో ఆకట్టుకున్నారు.

ఒకే వేదికపై 10 విభాగాల్లో పోటీలు

ఈసారి పోటీల్లో ఒకే వేదికన 10 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్ హాకీ సహా పది రకాల విభాగాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 3,800 క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇంత మంచి వేదికపై పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందంటూ... చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీఎంఆర్​డీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు బాగున్నాయని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మెచ్చుకోవడం నిర్వాహకుల్లో సంతోషం నింపింది. భవిష్యత్‌లో మరిన్ని పోటీలు మరింత అద్భుతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

అది..డెంగీ కాదు.. మలేరియా కాదు.. కానీ డేంజర్!

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.