ETV Bharat / city

'నీ సంగతి చూస్తా..' మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర

author img

By

Published : May 16, 2022, 7:40 PM IST

మాజీ మంత్రి అవంతి
మాజీ మంత్రి అవంతి

Ex minister Avanti fire on Media: మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిండు సభలో నీ సంగతి చూస్తా అంటూ ఓ మీడియా ప్రతినిధిపై నిప్పులు చెరిగారు.

నీ సంగతి చూస్తా.. మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర

Minister Avanti: విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు. రైతు భరోసా నిధులు విడుదల సభలో పాల్గొన్న ఆయన.. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా.. ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ.. చేయి చూపించి కులం పేరుతో దూషించారు. మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో తెదేపా.. లేనిపోని ఆరోపణలు చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.