ETV Bharat / city

'దొంగ ఓట్ల వ్యవహారంపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ చూపాలి'

author img

By

Published : Apr 18, 2021, 3:24 PM IST

Updated : Apr 18, 2021, 4:34 PM IST

ayyannapatrudu response on fake voting, ayyanna demands to resign dgp
తిరుపతి పోలింగ్​లో దొంగ ఓట్లపై స్పందించిన అయ్యన్నపాత్రుడు, డీజీపీ రాజీనామా చేయాలని అయ్యన్న డిమాండ్

సిగ్గు లేకుండా దొంగ ఓటర్లతో ఓట్లు వేయించుకున్నారని తెదేపా నాయకులు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దొంగ ఓట్ల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అయ్యన్నపాత్రుడు

తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. దొంగ ఓటర్లను తీసుకొచ్చి సిగ్గులేకుండా ఓట్లు వేయించుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. దొంగలు, కేటుగాళ్లకు అధికారమిస్తే పరిపాలన ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేసుకుంటే.. ఎన్నికల ప్రక్రియ వృథా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బంగాల్​లో రాహుల్​ ర్యాలీలు రద్దు

డీజీపీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం దారుణమని అయ్యన్న మండిపడ్డారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయడంపై నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దొంగలను పట్టుకున్న పోలీసులు.. వారికే బానిసలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలన్నారు.

ఇదీ చదవండి:

'తిరుపతిలో రీ పోలింగ్​ నిర్వహించాలి..

Last Updated :Apr 18, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.