ETV Bharat / city

మాపై కాఠీన్యమా..? కారుణ్య నియామకాలపై ఆర్టీసీ కార్మిక కుటుంబాల ఆవేదన

author img

By

Published : Oct 29, 2021, 3:45 PM IST

RTC EMPLOYEES FAMILY'S PROTEST IN VIJAYAWADA
కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి: ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఆందోళన

ఆర్టీసీలో 2016 నుంచి 2019 వరకు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని.. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. విజయవాడ లోని ఆర్టీసీ కేంద్రకార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేశారు.

కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ.. విజయవాడలోని ఆర్టీసీ(rtc) కేంద్ర కార్యాలయం వద్ద ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కారుణ్య నియామకాల భర్తీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2016 నుంచి 2019 వరకు నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఇంకా ఆలస్యం చేయవద్దన్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలతో కార్యాలయం నుంచి బయటికొచ్చిన ఆర్టీసీ ఉన్నతాధికారులు.. వినతులు ఉంటే అందించాలని కోరారు.

2020 నుంచి.. కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మాత్రమే కారుణ్య నియామకాలు చేపట్టాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలి ఇచ్చిందని.. అంతకు ముందు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వాటికి ఉద్యోగాలు భర్తీ పై ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఉద్యోగుల కుటుంబసభ్యులు.. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి.. ఇంటర్నెట్‌ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.