ETV Bharat / city

Minister kannababu: డీసీసీబీలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి కన్నబాబు

author img

By

Published : Dec 15, 2021, 7:40 PM IST

కన్నబాబు
కన్నబాబు

Minister kannababu: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు హెచ్చరించారు.

Minister kannababu: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని, పూఏసిఏస్​లను మూడు అంచెల్లో పూర్తిగా ఆధునికరణ చేస్తున్నట్లు తెలిపారు.

రైతులు పట్టణాలకు వెళ్లి సమయం వృథా కాకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెదేపా హయాంలో దొంగ పాస్​ బుక్​లతో బ్యాంకుల్లో అవినీతి చోటు చేసుకుందన్నారు. చనిపోయిన వారి పేరుతోనూ రుణాలు పొందారని పేర్కొన్నారు. రైతుల పేరుతో అధికారులు రుణాలు పొందితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

గుంటూరు సహకార బాంక్​లో గృహ రుణాలను కూడా అందించటం అభినందనీయమని అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. తామర పురుగుతో మిర్చి పంట నష్టపోయిన విషయం సీఎం దృష్టికి వచ్చిందని, దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చిస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీసీసీబీ ఛైర్మన్​ రామాంజనేయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CONDOLENCES ON BUS ACCIDENT: బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.