TOP NEWS: ప్రధాన వార్తలు @ 7AM

author img

By

Published : Jun 24, 2022, 7:10 AM IST

TOP NEWS

.

  • ఎన్డీయే అభ్యర్థికి వైకాపా మద్దతు.. ప్రత్యేక హోదా లాంటి షరతు లేకుండానే..!
    ప్రత్యేక హోదా లాంటి షరతులేమీ లేకుండానే ఎన్టీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించింది వైకాపా. ద్రౌపదీ ముర్ము నామినేషన్‌కు పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
    నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్థి రేపు నామినేషన్​ దాఖలు చేయనున్న నేపథ్యంలో.. దిల్లీ వెళ్లాలని సీఎం భావించినా.. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చిత్తూరు మాజీ మేయర్‌ హేమలతపైకి పోలీసు జీపు!
    చిత్తూరులో గురువారం రాత్రి 11 గంటల సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్​, తెదేపా నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ సోదా చేశారు పోలీసులు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనుక బైఠాయించారు. అయినా జీపును రివర్స్‌ చేసి పోనివ్వమని సీఐ ఆదేశించారని, దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయిందని ఆమె అనుచరులు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రజాసమస్యలపై.. త్వరలోనే రోడ్డెక్కుతా..: నారా లోకేశ్‌
    Nara Lokesh: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేడే ద్రౌపదీ ముర్ము నామినేషన్.. జులై 1 నుంచి రాష్ట్రాల పర్యటన
    Droupadi Murmu news: అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్​పై మోదీ, అమిత్ షా, రాజ్​నాథ్, నడ్డా, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ''బ్రిక్స్‌ సహకారం'తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం'
    బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్​గా హాజరై ప్రసంగించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోషిస్తున్న పాత్రకు మద్దతు పలుకుతున్నామంటూ 'బీజింగ్‌ డిక్లరేషన్‌'లో పేర్కొన్నారు బ్రిక్స్​ దేశాధినేతలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బ్రిక్స్‌ సహకారానికి పుతిన్‌ పిలుపు.. ఇజ్రాయెల్​పై జెలెన్​స్కీ గరం
    ఉక్రెయిన్​కు అండగా నిలుస్తూ పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని బ్రిక్స్​ దేశాలకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్. బ్రిక్స్​ 14వ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. మరోవైపు.. ఇజ్రాయెల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రూ.4.3లక్షల కోట్లకు భారత మీడియా, వినోద రంగం!
    భారత మీడియా, వినోద రంగం వాటా 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయనం తేల్చింది. సంప్రదాయ మీడియాలో వృద్ధితోపాటే డిజిటల్‌ మీడియా, ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్రకటనలు మరింత విస్తృతమవడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధాకరం'
    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్​పై లెజండరీ ప్లేయర్​ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడపడం బాధగా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'చోర్​ బజార్'లో కొట్టేసిన వజ్రం.. 'విక్రాంత్‌ రోణ' ట్రైలర్‌ రిలీజ్​
    మరికొన్ని గంటల్లో విడుదల కానున్న 'చోర్​ బజార్' నుంచి కొత్త ట్రైలర్​ను విడుదల చేసి.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది చిత్ర బృందం. 'మై డియర్ భూతం' సినిమాలో ప్రభుదేవా డ్యాన్స్​.. విక్రాంత్‌ రోణ ట్రైలర్‌ అప్డేట్స్​ మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.