ప్రజాసమస్యలపై.. త్వరలోనే రోడ్డెక్కుతా..: నారా లోకేశ్‌

author img

By

Published : Jun 23, 2022, 11:04 PM IST

Lokesh

Nara Lokesh: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేశ్​ అన్నారు.

సీఎం జగన్​పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేశ్​ అన్నారు. తన కార్యక్రమం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారన్న లోకేశ్​.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తన కార్యక్రమం 9గంటలు ఆలస్యమైనా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికారు.. జగన్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో దీనిబట్టే తెలుస్తోందన్నారు.

కేసులకే భయపడని తాము.. ఇక నోటీసులకు భయపడతామా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తూ.. పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొందరు నేతలు చెత్తబుట్టలో వేస్తే.. మరికొందరైతే తగలబెట్టారని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించిన నాయకులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్​.. రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని తాను వ్యక్తిగతంగా చదివిస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.