'చోర్​ బజార్'లో కొట్టేసిన వజ్రం.. 'విక్రాంత్‌ రోణ' ట్రైలర్‌ రిలీజ్​

author img

By

Published : Jun 23, 2022, 10:45 PM IST

Chor Bazaar, Vikrant Rona, My Dear Bhoot Movie Updates

మరికొన్ని గంటల్లో విడుదల కానున్న 'చోర్​ బజార్' నుంచి కొత్త ట్రైలర్​ను విడుదల చేసి.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది చిత్ర బృందం. 'మై డియర్ భూతం' సినిమాలో ప్రభుదేవా డ్యాన్స్​.. విక్రాంత్‌ రోణ ట్రైలర్‌ అప్డేట్స్​ మీకోసం..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న 'చోర్​ బజార్' సినిమా కొత్త ట్రైలర్​ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. రిలీజ్​కు కొన్ని గంటల మందు.. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ ట్రైలర్‌ను వదలడం గమనార్హం. ట్రైలర్‌లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం కీలకమైన అంశంగా కనిపించింది. డైమండ్ చోరీ నేపథ్యంలో జరిగే చోరులు, పోలీసుల హంగామా ఆకట్టుకొంది.​ ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్​ కాగా.. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విక్రాంత్‌ రోణ ట్రైలర్‌ చూశారా?
కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన 'విక్రాంత్‌ రోణ'. సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్‌ భండారి దర్శకుడు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రభుదేవా డ్యాన్స్‌ మామూలుగా లేదుగా..
ప్రభు దేవా ప్రధానపాత్రలో నటిస్తున్న 'మై డియర్ భూతం' సినిమాలో గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేశారు. 'మాస్టర్ ఓ మై మాస్టర్' అంటూ సాగే ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్​గా నిలిచింది. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: తరుణ్​ భాస్కర్​ కొత్త సినిమా టైటిల్.. లారెన్స్ 'రుద్రుడు' ఫస్ట్​లుక్.. హిందీ 'హిట్'​ ట్రైలర్​.. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.