TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : May 11, 2022, 9:02 AM IST

TOP NEWS

.

  • బలహీనపడిన 'అసని'.. ఈశాన్యం వైపునకు కదులుతున్న తుపాను
    Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్నట్లు సమాచారం.. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాయమవుతున్న పోలవరం కాలువ గట్లు... ఇలాగే కొనసాగితే..
    Polavaram: పోలవరం కాలువ గట్లు రానురాను మాయమవుతున్నాయి. గట్లకు ఇరువైపులా మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వందల టిప్పర్లతో మట్టిని దోచేస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని, కాలువ గట్లకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఉత్తర్వులు జారీ అయినా అమలుకు నోచని పథకం!
    వైఎస్ఆర్ పెళ్లి కానుక. బీసీలకైతే రూ.50 వేలు..ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి లక్ష,.. కులాంతర వివాహాలకైతే ఏకంగా రూ. లక్షా 20 వేలు.! ఇవన్నీ ఇచ్చేశారనుకుంటున్నారా.! ఇస్తామని ప్రకటించారంతే.! గత ప్రభుత్వం పెళ్లిపందిట్లోనే కానుక అందిస్తే అందిస్తే.. ఈ ప్రభుత్వంలో పెళ్లై పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందించలేకపోయింది . పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • CBN: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..!
    CBN: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉగ్రవాద నిధుల కోసం కశ్మీరీలకు పాక్​ ఎంబీబీఎస్​ సీట్లు!
    Pakisthan MBBS Seats: పాకిస్థాన్​ ఎంబీబీఎస్​ సీట్లను జమ్ముకశ్మీర్​లో విక్రయించి.. ఆ సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలపై ప్రముఖ హురియత్​ నేత అక్బర్​ భట్​తో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపింది ప్రత్యేక కోర్టు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 160కి 173 మార్కులు.. ఆ టీచర్ల లెక్కలకు విద్యార్థులే షాక్​!
    సాధారణంగా మంచిగా చదివే కొందరు విద్యార్థులకు పరీక్షల్లో 100 మార్కులకు 100 లేదా 99 వరకు వస్తుంటాయి. కానీ గుజరాత్​ విద్యార్థులకు ఇటీవల జరిగిన ఎగ్జామ్స్​లో కొంతమందికి 160కి 173 మార్కులు వచ్చాయి. అదెలాగా..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాణి లేకుండా బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు.. దానికి సంకేతమా?
    బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 మంగళవారం.. పార్లమెంటు సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాబోరని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఆమె 70 ఏళ్ళ పాలనా కాలంలో గర్భిణిగా ఉన్న 1959, 1963 సంవత్సరాల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ తర్వాత హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. అయితే ఇది అధికార మార్పిడి దిశగా పడుతున్న అడుగులకు సంకేతమని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్​బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు
    State Bank Of India Deposit Rate Increased:స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్లు, అంతకుమించిన టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు మంగళవారం ఎస్‌బీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Yuvaraj singh: కోట్లొస్తుంటే టెస్టులెందుకు ఆడతారు?
    Yuvaraj singh about Test cricket: ప్రేక్షకులు టీ20 క్రికెట్​ కావాలనుకుంటున్నారని అందుకే టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందని అన్నాడు మాజీ స్టార్​ యువరాజ్ సింగ్​. ప్లేయర్స్​కు ఆదాయం కూడా టెస్టుతో పోలిస్తే టీ20లోనే ఎక్కువగా వస్తుందని చెప్పాడు. అందుకే ఆటగాళ్లు కూడా టీ20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అలా చెప్పడానికి ఏమాత్రం వెనకాడను: మహేశ్​బాబు
    Maheshbabu Sarkaru vari paata: 'సర్కారు వారి పాట' చేస్తున్నప్పుడు 'పోకిరి' రోజులు ఎందుకు గుర్తుకొచ్చాయో చెప్పారు హీరో మహేశ్​బాబు. ఈ మూవీ ప్రయాణం ఎలా సాగింది? కరోనా సమయంలో కథలో మార్పులు, చేర్పులేమైనా చేశారా? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులివీ... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.