ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Sep 14, 2022, 7:01 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • అమరావతి రైతుల పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత
    Tension At Amaravati Farmers MahaPadayatra : అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్రలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెనాలిలో ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు వారిని అడ్డుకుని.. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర చేస్తామని చెప్పిన రైతులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బౌన్సర్లు, బెంజ్​ కార్లతో పాదయాత్రా..?: మంత్రి చెల్లుబోయిన
    Minister Venugopal On Farmers Padayatra : అమరావతి రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేయలేదని.. కేవలం వ్యాపారం, లాభం కోసం మాత్రమే ఇచ్చారని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు. బౌన్సర్లు, బెంజ్ కార్లతో రైతులు పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం మరోసారి పొడిగింపు
    Free Accommodation Extended : రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూన్​ 26 వరకూ పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Imprisonment for life: మాజీ నక్సలైట్ నరసింహారెడ్డికి యావజ్జీవ శిక్ష
    Ex Naxalite Narasimha Reddy: నక్సలైట్లుగా ఉన్నప్పుడు తెదేపా నేతలను హత్య చేశాడు.. ఇప్పడు వైకాపా నేతగా చెలామణి అవుతున్నాడు. 2004లో జరిగిన హత్యల కేసులో ఇప్పటికీ న్యాయం జరిగిందంటూ బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2004లో చంద్రబాబు, తెదేపా నేతలు తలపెట్టిన విజయబేరి సభకు వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు నక్సలైట్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రాహుల్ యాత్ర విజయం చూడలేకే భాజపా 'ఆపరేషన్​ బురద''
    గోవాలో 8 మంది శాసనసభ్యులు భాజపాలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. భారత్​ జోడో యాత్ర విజయాన్ని ఓర్వలేకే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం
    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. యడ్డీ ముఖ్యమంత్రిగా ఉండగా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. నివేదిక సమర్పణకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్రిటన్ రాణి అంత్యక్రియలకు ముర్ము.. రాష్ట్రపతిగా తొలి విదేశీ పర్యటన
    Queen Elizabeth Funeral : రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ద్రౌపదీ ముర్ము. బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు హాజరుకానున్నారు ముర్ము. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్‌లో తొలి చిప్‌ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!
    దేశంలో తొలి చిప్​ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది. వేదాంతా, ఫాక్స్‌కాన్‌ సంస్థలు కలిసి సెమీకండక్టర్‌ ప్లాంటును గుజరాత్‌లో నిర్మించనున్నాయి. రెండేళ్లలో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలవుతుందని వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బీసీసీఐ రాజ్యాంగ సవరణకు సుప్రీం ఓకే.. ఇక కూలింగ్ పీరియడ్ లేనట్లే
    BCCI Constitution Amendment : బీసీసీఐ రాజ్యాంగ సవరణను అంగీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ సవరణ రాజ్యాంగ అసలు లక్ష్యాన్ని వక్రీకరించదని భావిస్తున్నామని.. అందుకే ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై బుధవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జర్నలిస్ట్​పై మండిపడ్డ తాప్సీ.. అలా ఎందుకు చేయరంటూ..
    ఓ అవార్డు ఫంక్షన్​లో పాల్గొన్న హీరోయిన్ తాప్సీ.. రిపోర్టర్​పై మండిపడింది. 'ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్‌ చేసుకుని రాలేరా' అని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.