ETV Bharat / city

Chandrababu: ‘క్యాసినో’పై ఈడీ దర్యాప్తు కోరదాం...తెదేపా నిజనిర్ధారణ కమిటీ సూచన

author img

By

Published : Jan 26, 2022, 7:03 AM IST

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu: గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘాతమని తెదేపా నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది.

Chandrababu: సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘాతమని తెదేపా నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది. కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో పాటు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మంగళవారం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి నివేదిక అందజేశారు. ‘మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు, ఇతర రాష్ట్రాల యువతులతో అశ్లీల నృత్యాలు చేయించినట్టు, తీన్‌పత్తీ, రోలెట్‌ తదితర జూదాలు జరిగినట్టు పట్టణమంతా కోడై కూస్తోంది.

మంత్రికి సన్నిహితుడైన వైకాపా నాయకుడు మండలి హనుమంతరావు.. మేం గుడివాడ వెళ్లడాన్ని నిరసిస్తూ క్యాసినో నడుస్తున్నప్పుడు రాకుండా ఇప్పుడొచ్చి ఏం చేస్తున్నారని బూతులు తిట్టారు. క్యాసినో జరిగిందనడానికి ఇదే నిదర్శనం’ అని నివేదిక పేర్కొంది. ‘క్యాసినోలో పాల్గొన్న వ్యక్తులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు, అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్టు ప్యాసింజర్‌ లిస్టు, వారికి టికెట్లు బుక్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబరు ద్వారా తెలిసింది’ అంటూ ఆ పేర్లు నివేదికలో ప్రస్తావించారు. ‘కోట్ల డబ్బు చేతులు మారడంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి లేఖ రాయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ఆర్థికశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. మద్యం సరఫరాపై ఎస్‌ఈబీకి లేఖ రాయాలి. దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు సుముఖంగా లేనందున కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే నిజాలు బయటపడతాయి. న్యాయస్థానాలనూ ఆశ్రయించాలి’ అని నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తెదేపా నేతలు మీడియాతో మాట్లాడుతూ క్యాసినో ఘటనపై బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

New Districts in AP: రాష్ట్రంలో ఇకపై 26 జిల్లాలు.. నోటిఫికేషన్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.