ETV Bharat / city

ntr statue:ఖమ్మంలో శ్రీకృష్ణావతారంలో 'ఎన్టీఆర్​'... ఆవిష్కరణకు జూనియర్‌ రాక

author img

By

Published : Jan 20, 2022, 4:39 PM IST

NTR Statue: తెలంగాణలోని ఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. మే 28న 100వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.

ఖమ్మంలో శ్రీకృష్ణావతారంలో 'ఎన్టీఆర్​
ఖమ్మంలో శ్రీకృష్ణావతారంలో 'ఎన్టీఆర్​

తెలంగాణలోని ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై భారీ సైజులో నట సార్వభౌమ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మే 28న ఎన్టీఆర్‌ 100వ జయంతిని పురస్కరించుకుని ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాత ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సినీ హీరో జూ.ఎన్టీఆర్‌తో ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 28న ఖమ్మం రాకకు ఎన్టీఆర్‌ అంగీకరించారని వారు తెలిపారు. పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగిస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌, రోప్‌బ్రిడ్జిలతో ఖమ్మం నగరానికి మణిహారంలా మారిన లకారం చెరువులో ఈ 54 అడుగుల భారీ విగ్రహం మరింత ఆకర్షణీయంగా మారనుంది.

54అడుగుల ఎత్తు

బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో.. తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు.

రూ.2.3 కోట్ల వ్యయంతో..

ప్రత్యేక సాంకేతికతను జోడించి నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మొత్తం రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలలో కృష్ణుని వేషధారణలో వెండితెర ఇలవేల్పుగా అవతరించిన ఎన్టీఆర్‌ను చూపాలన్న తపనతో నిర్వహకులు శ్రమిస్తున్నారు.

ఆకర్షణీయంగా..

ఖమ్మం లకారం ట్యాంక్​బండ్​పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెబున్నారు. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఒక్కసారైనా వచ్చి ఆయన విగ్రహాన్ని దర్శించుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న కేఎల్‌సీ క్లబ్‌ ఎండీ దొడ్డా రవి చెప్పారు.


ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.