ETV Bharat / state

CM YS Jagan Review: రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ చేపట్టండి: సీఎం జగన్

author img

By

Published : Jan 20, 2022, 3:44 PM IST

CM Jagan Review on Ports And Airports: పోర్టులు, విమానాశ్రయాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మంచి ఉద్దేశమన్న ఆయన.. వీటిని ఏకరీతిలో నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి చేయాలని ఆదేశించారు.భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలని స్పష్టం చేశారు.

CM YS Jagan
CM YS Jagan

CM Jagan Review on Airports: అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాలు నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మంచి ఉద్దేశమన్నారు. ఇందులో అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బోయింగ్‌ విమానాలూ దిగేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు. పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణతో పాటు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న ఆయన.. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలని స్పష్టంచ చేశారు. నిర్వహణలోని విమానాశ్రయాల పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని.. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

"రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి చేయాలి. రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలి. నిర్ణీత వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై శ్రద్ధ పెట్టాలి. రద్దీకి తగినట్లు సౌకర్యాలు, విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను ప్రాధాన్యంగా తీసుకోవాలి. హార్బర్లు, పోర్టులను ప్రాధాన్యంగా తీసుకుని నిర్మించాలి" - సీఎం జగన్

CM Jagan Review on Ports: రెండో విడతలో 5 హార్బర్లను నిర్ణీత వ్యవధిలో నిర్మిస్తామని సీఎంకు అధికారుల తెలిపారు. 5 ఫిషింగ్‌ హార్బర్లకు త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి

అప్పుడు పీఆర్సీకి అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదు: మంత్రి సురేశ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.