ETV Bharat / city

CAG: కాగ్​ ఆదేశాల మేరకు వాటి అప్పులపై ప్రత్యేక ఆడిట్​

author img

By

Published : Oct 19, 2022, 7:28 AM IST

CAG report
కాగ్​

CAG: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారింటింది. కాగ్‌ ఆదేశాల మేరకు ఆడిట్‌ విభాగం అధికారులు రాష్ట్ర ఆర్థికశాఖలో కార్పొరేషన్ల అప్పులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వివిధ కార్పొరేషన్లకు రూ.1,69,905కోట్లకు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం... తాజాగా మరో 7వేల కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

CAG: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. కాగ్‌ ఆదేశాల మేరకు ఆడిట్‌ విభాగం అధికారులు రాష్ట్ర ఆర్థికశాఖలో కార్పొరేషన్ల అప్పులను 2 రోజులుగా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆడిట్‌ అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సత్య’దూరమైన లెక్కలు అందిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం కార్పొరేషన్లపై తెచ్చిన అప్పుల భారం మరీ ఎక్కువ ఉన్నా... తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం లక్షా69వేల905 కోట్ల రూపాయలకు గ్యారంటీలు ఇచ్చింది.

తాజాగా మరో 7వేల కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్ల అప్పుల భారం 2022 మార్చి 31 నాటికి లక్షా38వేల605 కోట్ల రూపాయలు ఉన్నట్లు వివిధ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇవికాకుండా నాన్‌ గ్యారంటీ రుణాలు 87వేల233 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేషన్లపై రుణభారం రూ.40 వేల కోట్లే ఉన్నట్లు రాష్ట్ర అధికారి ఆడిట్‌ విభాగానికి తెలియజేసినట్లు సమాచారం. ఈక్రమంలో చేపట్టిన ప్రత్యేక ఆడిట్‌ పూర్తైతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.