ETV Bharat / city

Nizamabad Family Suicide Case Updates : నిజామాబాద్​కు చేరుకున్న విజయవాడ పోలీసులు

author img

By

Published : Jan 11, 2022, 4:30 PM IST

నిజామాబాద్​కు చేరుకున్న విజయవాడ పోలీసులు
నిజామాబాద్​కు చేరుకున్న విజయవాడ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన తెలంగాణలోని నిజామాబాద్​ కుటుంబం ఆత్మహత్య కేసుపై విచారణ జరిపేందుకు విజయవాడ పోలీసులు నిజామాబాద్​ చేరుకున్నారు. సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ నిమిత్తం అతను నివాసముంటున్న అపార్ట్​మెంట్​కు వెళ్లారు. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు.

Nizamabad Family Suicide Case Updates : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన తెలంగాణలోని నిజామాబాద్​ కుటుంబం ఆత్మహత్య కేసుపై విచారణ జరిపేందుకు విజయవాడ పోలీసులు నిజామాబాద్​ చేరుకున్నారు. సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ నిమిత్తం అతను నివాసముంటున్న అపార్ట్​మెంట్​కు వెళ్లారు. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు. విజయవాడ వన్‌ టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సురేశ్​ ఇంటిని పరిశీలించిన పోలీసులు.. అపార్ట్​మెంట్​ వాసులను ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబం గురించి తెలుసుకుంటున్నారు.

Vijayawada Police Reached Nizamabad : 'సురేష్‌ కుటుంబానికి అప్పులిచ్చిన వ్యాపారులను విచారిస్తాం. నిందితుల్లో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. విచారణ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం.'

- వెంకటేశ్వర్లు, విజయవాడ వన్​టౌన్ సీఐ

నలుగురిపై కేసు..

Nizamabad Family Suicide Case News: మృతుడు సురేశ్​ రాసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేధింపుల ఆరోపణలపై నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు. 306 సెక్షన్ కింద నిజామాబాద్​కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్​, నిర్మల్​కు చెందిన వినీత, చంద్రశేఖర్​పై కేసు నమోదు చేశారు.

సెల్ఫీ వీడియో

vijayawada Family suicide case selfie video : విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కుటుంబం సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని పేర్కొన్న పప్పుల సురేశ్‌ సెల్ఫీ వీడియో విడుదలైంది. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడన్న సురేశ్‌... జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించానని ఆ వీడియోలో వెల్లడించారు. వడ్డీలు చెల్లించినా ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నారని.. అధిక వడ్డీల కోసం గణేశ్‌ కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చాడని సురేశ్‌ వీడియోలో పేర్కొన్నారు. గణేశ్‌కు రూ.80లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు. ఈ వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు వేధింపుల ఆరోపణలపై నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నిమిత్తమే నిజామాబాద్​ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగింది?

Nizamabad Family Suicide Case in Telangana : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్​కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా.. వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు

ఇదీ చదవండి : కరోనా పరిస్థితిపై సీఎంలతో మోదీ భేటీ- కఠిన ఆంక్షలు విధిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.