ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది : జేడీ లక్ష్మీనారాయణ - JD Lakshminarayana Comment

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 12:38 PM IST

thumbnail
ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది : జేడీ లక్ష్మీనారాయణ (ETV Bharat)

JD Lakshminarayana Comment on Land Titling Act in AP : జగన్ సర్కార్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన​ ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉందని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అనకాపల్లిలో న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ అనకాపల్లిలో వంద రోజులు పాటు న్యాయవాదులు నిరసన దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో న్యాయవాద అధికారాన్ని తీసేయడం వల్ల భూ సమస్యలు మరింత పెరుగుతాయని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం వల్ల తమ భూములు తమకు ఉంటాయో ఉండవో అని ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ చట్టం అమలు అయితే రైతులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్టం ఎలా ఉంటే బాగుంటుందో అనకాపల్లిలోని న్యాయవాదులు చర్చించి ఒక నివేదికను తయారు చేయాలని జేడీ లక్ష్మీనారాయణ కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.