ETV Bharat / city

ఒడిశా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఏపీకి ఆదేశం..

author img

By

Published : Sep 24, 2021, 12:52 PM IST

Hearing in  Supreme Court on the petitions filed by Odisha
ఒడిశా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

ఒడిశా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా వేసిన పిటిషన్లకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఏపీకి ఆదేశం జారీచేసింది.

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఏపీకి ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు నోట్‌ రూపంలో అందించాలని ఏపీ, ఒడిశాకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు సమాచారం, డాక్యుమెంట్లు కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్‌ 11కు వాయిదా వేసింది జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం.

గతంలో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తదుపరి ఆదేశాలపైనా ఒడిశా ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. తాజా పిటిషన్‌ను గత పిటిషన్లతో కలిపి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. నవంబర్‌లో పూర్తి వాదనలు ఉంటాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం తెలిపింది. వాయిదాలు లేకుండా విచారణ పూర్తికి సహకరించాలని ధర్మాసనం కోరింది.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.