ETV Bharat / city

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు, 3 వారాల్లో 1608 కేసులు

author img

By

Published : Aug 23, 2022, 2:07 PM IST

DENGUE
డెంగీ కేసులు

Dengue cases మంచినీటిలో పెరిగే ఎడిస్​ ఈజిప్టి దోమ ప్రభావం తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దోమలు కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వీటివల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసుకుందాం.

Dengue cases: తెలంగాణ రాష్ట్రంలో డెంగీ జ్వరం బారిన పడిన వారి సంఖ్య రోజరోజుకీ పెరుగుతుంది. ఈ సంవత్సరానికి ముగియడానకి ఇంకో నాలుగు నెలలు మిగిలి ఉండగానే కేసులు 3109గా నమోదయ్యాయి. సంవత్సరం ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మంచినీటిలో పెరిగే ‘ఎడిస్‌ ఈజిప్టి’ దోమ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ దోమలు కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

జిల్లాల వారిగా నమోదైన డెంగీ కేసులు: ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో అత్యధికంగా 12,205 నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో 1,470 మంది డెంగీ బారిన పడ్డారు. ఇక్కడ 12.04 పాజిటివిటీ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2,044 నమూనాలను పరీక్షించగా 322 మంది(15.75% పాజిటివిటీ రేటు)కి వ్యాధి నిర్ధారణ అయింది. మేడ్చల్‌ జిల్లాలో 1,375 నమూనాలకు 165 మంది డెంగీ బారిన పడ్డారు. ఖమ్మంలో 3,815 నమూనాలకు గానూ 126 మంది వ్యాధికి గురైయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో 1,011 నమూనాలకు 123 మందికి, సంగారెడ్డి జిల్లాలో 1,662 నమూనాలకు 88 మందికి, ఆదిలాబాద్‌ జిల్లాలో 729 నమూనాలకు 81 మందికి డెంగీ సోకింది.

.

ఎడిస్​ ఈజిప్టి దోమ పెరిగే ప్రాంతాలు: డెంగీ కారక ‘ఎడిస్‌ ఈజిప్టి’ దోమ పగటిపూటే కుడుతుంది. మన ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పునరుత్పత్తి చేస్తుంది. ఎయిర్‌ కూలర్లు, డ్రమ్ములు, పాత టైర్లు, రేకు డబ్బాల్లో నిల్వ ఉండే నీటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది.

జాగ్రత్తలు: అందుకే ఎక్కడ కొద్దిపాటి నీటి నీటి నిల్వలున్నా వాటిపై దృష్టిపెట్టాలి. మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.