ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Oct 2, 2022, 6:59 PM IST

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలు ముక్కలైన నోట్లు.. ఏం జరిగింది..?
    RATS DESTROY MONEY : ఓ సామాన్య రైతు.. తన కుటుంబ అవసరాల కోసం ఓ షావుకారి దగ్గర కొంత మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి చెక్కపెట్టెలో జాగత్త్రగా దాచిపెట్టాడు. రెండు రోజుల తర్వాత చూస్తే అవి ముక్కలు ముక్కలుగా కనిపించాయి. దీనికంతటికి కారణం తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
    JAGAN IN VIJAYAWADA : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్​ పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైఎస్సార్​ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. సొంతపార్టీ నాయకులే ఫిర్యాదు
    YSRCP SAND MAFIA : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. దొంగలు - దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. వైకాపా నాయకులు ఇసుక క్వారీలను దోచుకుంటున్నారు. పాపాగ్ని నుంచి ఇష్టారీతిన ఇసుక తవ్వి.. లారీలు, ట్రాక్టర్లతో భారీగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సొంత పార్టీ నాయకులే దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేశారంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Three injured: పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు
    Car accident: రోడ్డు ప్రమాదాల విషయంలో కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా బాధితులుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేగ నియంత్రణ కోల్పోయిన కారు రహదారిపై వెళ్తున్న వారి మీదకు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఖర్గేతో మార్పు సాధ్యం కాదు'.. ముఖాముఖి చర్చకు శశిథరూర్ డిమాండ్!
    కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పును తాను తీసుకొస్తానని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ పేర్కొన్నారు. పోటీలో ఉన్న మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గేతో మార్పు సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా.. ఖర్గేతో బహిరంగ ముఖాముఖి నిర్వహించాలని ఆయన కోరారు. కాగా, ఎవరినో ఎదిరించడానికి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఖర్గే స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ.. వ్యాపారికి రూ.కోటికి పైగా టోకరా
    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే నకిలీ సంతకంతో ఓ వ్యాపారికి రూ.1.31 కోట్లు టోకరా పెట్టారు ఇద్దరు వ్యక్తులు. వ్యాపారి ఫిర్యాదుతో నిందితులపై ఛీటింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇయన్'​ బీభత్సానికి 47 మంది బలి.. మోదీ సంతాపం
    అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆ దేశ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఈ తుపాన్‌ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రతాపం చూపింది. తుపాన్​ ధాటికి ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.500తోనే బంగారం, వెండిలో మదుపు.. ఇవి తెలుసుకోండి!
    బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అది కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో, చాలా చిన్న మొత్తాల్లో! అయితే ఈ ఫండ్​ ఆఫ్​ ఫండ్స్​ గురించి తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్​ ప్రోమో.. మీరు చూశారా?
    ICC T20 World Cup 2022: ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్.. ఇది ఒక ఎమోషన్. ఈ మ్యాచ్​ ఎప్పుడు జరిగినా టీవీలకు అతుక్కుపోవడం భారత క్రికెట్​ అభిమానుల వంతు అవుతుంది. అయితే త్వరలోనే టీ20 ప్రపంచకప్​లో భాగంగా దాయాదుల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నెల 23న భారత్​ పాకిస్థాన్ తలపడనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రభాస్‌ 'ఆది పురుష్‌' టీజర్‌ టాక్‌.. ఎలా ఉందంటే?
    పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ 'ఆదిపురుష్‌'. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఆదివారం 'ఆదిపురుష్‌' టీజర్‌ను అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నారు. 1.40 నిమిషాల పాటు సాగే టీజర్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.