అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలు ముక్కలైన నోట్లు.. ఏం జరిగింది..?

author img

By

Published : Oct 2, 2022, 5:51 PM IST

RODENTS DESTROY MONEY

RATS DESTROY MONEY : ఓ సామాన్య రైతు.. తన కుటుంబ అవసరాల కోసం ఓ షావుకారి దగ్గర కొంత మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి చెక్కపెట్టెలో జాగత్త్రగా దాచిపెట్టాడు. రెండు రోజుల తర్వాత చూస్తే అవి ముక్కలు ముక్కలుగా కనిపించాయి. దీనికంతటికి కారణం తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదవండి..

RODENTS DESTROY MONEY : ప్రకాశం జిల్లాలోని అగస్టిన్ అనే మధ్యతరగతి రైతు.. పొలం పెట్టుబడులకు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.70వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును జాగత్రగా ఇంటికి తీసుకొచ్చి.. అంతే జాగ్రత్తగా చెక్కపెట్టెలో భద్రపరిచాడు. రెండు రోజుల తర్వాత చెక్కపెట్టెలో ఉన్న డబ్బును భార్యను తీసుకురమ్మనగా.. తాళం తీసి చూసిన ఆమె విస్మయానికి గురైంది. కారణం.. అవి ముక్కలు ముక్కలుగా ఉండడం. ఆ చినిగిపోయిన ముక్కలనే తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టింది. అది చూసిన అగస్టిన్​ బోరున విలపించాడు.

అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలుగా మారిన వైనం

అప్పుగా తీసుకున్న డబ్బు ఇలా ముక్కలు ముక్కలు కావడం.. తన కోడలికి ప్రసవం దగ్గర పడుతుండడంతో ఏమి చేయాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఇంతకీ ఆ డబ్బులు ఏలా ముక్కలు అయ్యాయో చెప్పలేదు కదా.. ఎవరంటే మూషికరాజు. అవును మీరు విన్నది నిజమే.. ఈ పని చేసింది ఎలుకలే.. ఈ ఘటన జిల్లాలోని ముండ్లమూరు మండలం బృందావనం కాలనీలో జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.