ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jul 12, 2022, 5:04 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • వందేళ్లలో గోదావరికి ఇంతముందుగా ఇలా వరద ఎప్పుడూ రాలేదు: సీఎం జగన్​
    CM Jagan on floods: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై కలెకర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు, వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి.. రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోదావరికి పోటెత్తుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
    Godavari Flow: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయ ఉద్ధృతికి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తు బృందాలను ఎక్కడికక్కడ మోహరించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోర్టుకు హాజరుకాని ఆర్థికశాఖ కార్యదర్శి.. నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ
    Non-bailable Warrant to Finance Secretary: ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. నేడు కోర్టు హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కామారెడ్డిలో విషాదం.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి
    Electrocution: కామారెడ్డిలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఇంట్లో విద్యుత్​ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దూసుకెళ్లిన లారీ.. స్పాట్​లోనే టీచర్ మృతి.. స్కూటీ దగ్ధం
    పంజాబ్​ సంగ్రూర్​లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై బడికి వెళ్తున్న ఉపాధ్యాయురాలి పైనుంచి లారీ దూసుకెళ్లింది. భవీనా డగ్రోలి(30) ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో మంటలు చెలరేగి.. స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దొంగలకు చుక్కలు చూపించిన మరుగుజ్జు దంపతులు.. ఒకడ్ని పట్టుకుని...
    వారి ఎత్తు రెండున్నర అడుగులే... అయితేనేం దొంగలకు చుక్కలు చూపించారు.. ఇంట్లో చోరీకి వచ్చిన వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తీవ్ర ఇంధన కొరత.. ఇక సైకిళ్లే దిక్కు.. కి.మీ. పొడవునా జనం బారులు
    Sri Lankan Fuel Crisis: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే.. రాజకీయ సంక్షోభం కూడా తారస్థాయికి చేరింది. అధ్యక్షుడి జాడలేదు. ప్రధాని ఇంటిని నిరసనకారులు తగులబెట్టారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఇంధన కొరత నేపథ్యంలో.. లంక ప్రజలు కార్లు, బైక్స్​ను వదిలి సైకిళ్లకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు.. లంక అధ్యక్ష నివాసం మ్యూజియాన్ని తలపిస్తోంది. అధికార సౌధాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిగొచ్చిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధర ఎంతంటే?
    Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కోహ్లీ జట్టుకు భారంగా మారాడు.. పేరును చూసి టీమ్​లోకి తీసుకోవద్దు'
    Virat kohli news: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై సీనియర్​ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని అభిప్రాయపడ్డాడు మాజీ పేసర్​ వెంకటేశ్​ ప్రసాద్. మరోవైపు కోహ్లీ జట్టుకు భారంగా మారాడని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'జబర్దస్త్' ఆర్టిస్టుల రియల్​ ఫొటోస్​ మీరు చూశారా?
    బుల్లితెర నవ్వుల విందు 'జబర్దస్త్'. ఈ షో ఎందరికో లైఫ్​ ఇచ్చింది. చాలామంది కమె​డియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా సెలెబ్రిటీలుగా ఎదిరిన వారిలో హైపర్​ ఆది, ఆటో రామ్​ ప్రసాద్​, గెటప్​ శ్రీను.. లాంటి స్టార్స్​ ఉన్నారు. అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు.. షూటింగ్​ స్పాట్​లో కాకుండా.. బయట అనుకోకుండా దిగిన రియల్​ ఫొటోలను 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.