ETV Bharat / city

కోర్టుకు హాజరుకాని ఆర్థికశాఖ కార్యదర్శి.. నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ

author img

By

Published : Jul 12, 2022, 2:30 PM IST

Updated : Jul 12, 2022, 3:06 PM IST

High Court
High Court

14:26 July 12

Non-bailable Warrant: విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

Non-bailable Warrant to Finance Secretary: ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. నేడు కోర్టు హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, కొందరు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. కానీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం హాజరుకాకపోవడంతో.. ధర్మాసనం నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ చేసింది. బిల్లులు చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి:

Last Updated :Jul 12, 2022, 3:06 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.