ETV Bharat / city

CBN : ద్రౌపది ముర్ముతో.. భేటీకానున్న చంద్రబాబు

author img

By

Published : Jul 12, 2022, 1:13 PM IST

CBN : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం సమావేశం అవుతారు. ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే..

CBN MEETING
CBN MEETING

CBN : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం తరపున తమ మద్దతు తెలపనున్నారు.

ముర్ముకు మద్దతు: ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు తెదేపా వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి తెదేపా కట్టుబడి ఉందన్నారు.

PRESIDENTIAL POLL: రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్ము, యశ్వంత్​ సిన్హాతో పాటు పలువురు సామాన్యులు నామినేషన్​ దాఖలు చేశారు. వీరిలో ముంబయి మురికివాడకు చెందిన ఓ వ్యక్తి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ పేరుతో ఉన్న మరో వ్యక్తి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ ఉన్నారు. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహించనున్నారు. 21న కౌంటింగ్​ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.