ETV Bharat / state

'రక్తమో రామచంద్రా!'- తరిగిపోతున్న నిల్వలతో అత్యవసర వేళ ప్రాణాలకు ముప్పు - blood reserves Deficit in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 7:24 PM IST

Blood Reserves Deficit in Andhra Pradesh: ప్రకాశం జిల్లాలోని రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తరిగిపోతోన్నాయి. దీంతో రక్తం నిల్వలు లేక బాధితులు ఎదురుచూపులు చూస్తున్నారు. రక్త నిధి కేంద్రాలకు వెళితే స్టాక్‌ ఉండని పరిస్థితి కారణంగా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వెచ్చించి ప్రైవేట్‌ కేంద్రాల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.

Blood Reserves Deficit in Andhra Pradesh
Blood Reserves Deficit in Andhra Pradesh (ETV Bharat)

Blood Reserves Deficit in Andhra Pradesh: రక్తదానం అంటే ఒకరకంగా ప్రాణదానమే. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. రక్తం నిల్వలు లేక బాధితులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తరిగిపోతున్నాయి. రక్తం కోసం ఈ కేంద్రాలకు వెళితే స్టాక్‌ ఉండటంలేదు. వేరే చోటుకు వెళ్లమని సంబంధింత సిబ్బంది చెపుతుండటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులకు ప్రసవాల సమయంలోనూ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలు నిలబడాలంటే రక్తం అత్యవసరం. రక్తనిధి కేంద్రాల్లో నిత్యం రక్తం నిల్వలు పెట్టుకుంటారు. ప్రకాశం జిల్లాలో ఉన్న అనేక రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో (Blood Reserves Shortage) బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చే వారికి ఉచితంగా ఇస్తారు. బయట వారికైతే కొంత రుసుము చెల్లిస్తే ఇస్తారు. కానీ జిల్లాలో రక్త నిధి కేంద్రాల్లో అవసరమైనన్ని నిల్వలు లేవు.

రక్తదానంతో రోగికి మాత్రమే కాదు - దాతకూ సూపర్ హెల్త్​ బెనిఫిట్స్! - Blood Donation Health Benefits

ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి వంటి ప్రాంతాల గర్భిణులకు అత్యవసరంగా రక్తం అవసరం అయితే నిల్వలు లేకపోవడం వల్ల ప్రసవాలను కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. రక్తం కోసం అటూ ఇటూ తిరిగే కన్నా బాధితులనే రక్తం ఉన్న చోటుకు తీసుకువెళ్లడం మేలని జిల్లా కేంద్రానికి తీసుకువస్తున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో (Government General Hospital) ఉన్న రక్తనిధిలో కూడా అవసరమైనంత నిల్వలు లేవు. ప్రైవేట్‌ రక్త నిధి కేంద్రాలకు (Blood Centre) అధికంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.

ఒంగోలులోని ప్రభుత్వ రక్తనిధిలో నెలకు దాదాపు 300 యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. కానీ 200 యూనిట్ల కంటే ఎక్కువ సేకరించలేకపోతున్నారు. కళాశాలలకు సెలవులు రావడం, అందరూ ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో రక్తదాన శిబిరాలు జరగలేదు. వేసవి కాలం వల్ల రక్తదానానికి ఎవరూ ముందుకు రావడంలేదు. రెండు నెలలుగా విపరీతమైన కొరత ఏర్పడింది. ఎవరికైనా రక్తం అవసరం అయితే వారితో వచ్చిన వారో, తెలిసిన వారి నుంచో అప్పటికప్పుడు రక్తాన్ని సేకరించి ఇస్తున్నారు. రక్తదానం పట్ల అవగాహన, ఔదార్యం ఉన్న వాళ్లయితే ఇస్తున్నారు. లేదంటే కష్టం అవుతోంది.

'రక్తమో రామచంద్రా!'- తరిగిపోతున్న నిల్వలతో అత్యవసర వేళ ప్రాణాలకు ముప్పు (ETV Bharat)

"ఫ్రెండ్ వాళ్ల రిలేటివ్​కి బ్లడ్ అవసరం అయితే డొనేట్ చేశాను. మన బ్లడ్ వేరే వాళ్ల శరీరంలో ప్రవహిస్తుంది అంటే మనకి కూడా ఎంతో కొంత సంతోషంగా ఉంటుంది. అందువలన నేను ఇప్పటి అయిదు సార్లు డొనేట్ చేశాను". - దీపక్‌ రెడ్డి, రక్తదాత, తాళ్లూరు

ఆ ఊరిలో 520 ఇళ్లు- ఇంటికికొక రక్తదాత పక్కా- ఎక్కడో తెలుసా? - Blood Donors Village

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.