దూసుకెళ్లిన లారీ.. స్పాట్​లోనే టీచర్ మృతి.. స్కూటీ దగ్ధం

By

Published : Jul 12, 2022, 3:50 PM IST

thumbnail

పంజాబ్​ సంగ్రూర్​లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై బడికి వెళ్తున్న ఉపాధ్యాయురాలి పైనుంచి లారీ దూసుకెళ్లింది. భవీనా డగ్రోలి(30) ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో మంటలు చెలరేగి.. స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. ఇదంతా తాలిబ్​ చౌక్​లోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోగా.. కాసేపటికే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భవీనా మృతితో ఆమె ఐదేళ్ల కుమారుడు, భర్త, ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.