ETV Bharat / sports

'కోహ్లీ జట్టుకు భారంగా మారాడు.. పేరును చూసి టీమ్​లోకి తీసుకోవద్దు'

author img

By

Published : Jul 12, 2022, 8:26 AM IST

Virat kohli news: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై సీనియర్​ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని అభిప్రాయపడ్డాడు మాజీ పేసర్​ వెంకటేశ్​ ప్రసాద్. మరోవైపు కోహ్లీ జట్టుకు భారంగా మారాడని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

virat kohli news
virat kohli news

Virat kohli news: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నానాటికీ అతడి ప్రదర్శన ఏమాత్రం మెరుగు పడకపోతుండటంపై మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగే చేసి ఔటైన విరాట్‌ కోహ్లీ మూడో టీ20లోనూ 11 పరుగులకే పెవిలియన్‌ చేరి మరోసారి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ జట్టు ఎంపికపై విమర్శనాస్త్రాలు సంధించాడు. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని అభిప్రాయపడ్డాడు.

'ఇంతకుముందు ఎవరైనా సరిగ్గా ఆడకపోతే ఎంత పేరున్న ఆటగాడినైనా పక్కన పెట్టేవారు. సౌరభ్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, జహీర్‌, హర్భజన్‌ ఇలా ప్రతి ఒక్కరూ ఫామ్‌ కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌లోకి వెళ్లి అక్కడ రాణించి తిరిగి జాతీయ జట్టుకి వచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఎవరైనా ఫామ్‌లో లేకపోతే విశ్రాంతి ఇస్తున్నారు. దీనివల్ల ఏ ఉపయోగమూ లేదు. దేశంలో చాలా టాలెంట్‌ ఉంది. కేవలం వాళ్లకు పేరుందని చెప్పి ఆడించకూడదు. అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడు కూడా చాలా సందర్భాల్లో జట్టుకు దూరమయ్యాడు. టీమ్ఇండియా భవిష్యత్‌ బాగుండాలంటే ఇకనైనా భారీ చర్యలు తీసుకోక తప్పదు' అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు.

మరోవైపు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టుకు భారంగా మారాడని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రెండున్నరేళ్లుగా విరాట్‌ సరిగ్గా ఆడకపోతుండటం వల్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్లు అతడిని టెక్నిక్‌ మార్చుకోమని సూచిస్తుంటే మరికొందరు కొద్దికాలం ఆటకు దూరమవ్వాలని సలహాలిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా సైతం కోహ్లీ ఫామ్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'టీమ్‌ఇండియాలో సీనియర్‌ ఆటగాళ్లు లేకున్నా ఈ మధ్య యువకులే తలా ఓ చేయివేసి జట్టును గెలిపిస్తున్నారు. మరోవైపు విరాట్‌ జట్టుకు కష్టంగా మారాడు. దీంతో అతడు ఇప్పుడు తన స్థానాన్ని వేరేవాళ్లకైనా ఇవ్వాలి.. లేదా కొద్దికాలం ఆటకు దూరమై టీ20 ప్రపంచకప్‌ ముందైనా జట్టులో చేరాలి. అయితే, కోహ్లీ త్వరలోనే పరుగులు చేస్తాడని అభిమానులు అంటున్నారు. కానీ, అతడు ఈసారి భారత టీ20 లీగ్‌లో ఆడకుండా ఉండాల్సిందని నేను ముందు నుంచే చెబుతున్నాను. ఆ మెగా టోర్నీలో అతడు ఆడకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతుంటే కోహ్లీ మాత్రం జట్టుకు భారంగా మారాడు' అని తన యూట్యూబ్‌ ఛానల్లో చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి:

'ఐపీఎల్​లో విశ్రాంతి తీసుకోరు కానీ.. ఇప్పుడు కావాలా?'

కపిల్​దేవ్​కు రోహిత్ కౌంటర్.. కోహ్లీ గురించి మీకేం తెలుసంటూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.