ETV Bharat / city

3PM టాప్​న్యూస్​

author img

By

Published : Aug 13, 2022, 3:05 PM IST

3PM TOP NEWS
3PM టాప్​న్యూస్​

.

  • death Roads ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా
    death Roads ఈ నెల 4న డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళ్తూ రహదారి మధ్యలోని గుంత కారణంగా వ్యక్తి కిందపడిపోయారు. 2 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 6న మృతి చెందారు. ఈ ప్రమాదం మరిచిపోకముందే అదే గుంత వల్ల మరో యువకుడూ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Iron locker ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి బయటపడ్డ ఐరన్ లాకర్
    Iron locker పురాతన ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి పెద్ద ఐరన్ లాకర్ బాక్స్ బయటపడింది. కూలీలు ఇంటి యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచినా ఆనాటా ఈనోటా పాకి యజమానికి రామలింగానికి విషయం తెలిసింది. ఆ ఇనుప లాకర్లో గుప్తనిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. లాకర్‌ఇంకా తెరవలేదని యజమాని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కానిస్టేబుల్ హత్య కేసులో ఇద్దరు సీఐలపై ఉన్నతాధికార్ల చర్యలు
    ఇటీవల నంద్యాలలో జరిగిన పోలీసు కానిస్టేబుల్ సురేంద్ర హత్య ఘటనలో ఇద్దరు సీఐ లు ఓ ఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో పట్టణ సీఐ ఎన్​వీ రమణపై సస్పెన్షన్ వేటు పడగా, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఎఎస్సై కృష్ణారెడ్డిలను వీఆర్​కు పంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MLC Anantha Babu అభియోగపత్రం దాఖలులో తాత్సారం.. అనంతబాబుకు సహకరించటమే?
    MLC Anantha Babu: హత్య కేసులో అభియోగపత్రం దాఖలులో తాత్సారం చేయడం... అనంతబాబుకు సహకరించటమేననే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దళిత యువకుడి హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కదలకుండా ఎంతో బుద్ధిగా రాఖీ కట్టించుకున్న చిరుత
    రాజస్థాన్ రాజ్​సమంద్ జిల్లాలో ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. రోడ్డుపై వెళ్తున్న వణ్యప్రాణికి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే, ఆ చిరుతకు గాయాలు అయ్యాయి. అందువల్ల అది మెల్లిగా రహదారి పక్కన నడుస్తూ వెళ్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యమునా నది పడవ మునక ఘటనలో 11కు చేరిన మృతులు
    yamuna boat tragedy ఉత్తర్​ప్రదేశ్ బాందా జిల్లాలోని యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సతీమణితో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా
    Har Ghar Tiranga ఇంటింటా తిరంగ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్ విజయవాడలో పెరిగిన బంగారం ధర
    Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కామన్వెల్త్ పతకవిజేతలు దేశాన్ని గర్వించేలా చేశారని మోదీ ప్రశంసలు
    Commonwealth Games PM Modi కామన్వెల్త్​ క్రీడల పతకవిజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకొచ్చారంటూ చైతూ ఆవేదన
    యువహీరో నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వెళ్లడం తననెంతగానో బాధపెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.