ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : May 2, 2022, 10:59 AM IST

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

..

  • ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్​ 2024!!
    Prashant Kishor politics: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించనున్నారా? ఆయన తాజాగా చేసిన ట్వీట్ చూస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. "ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌
    తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ రాయల్‌ను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి
    పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతో తన ఇంటిపై మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త, కుమారులు, బంధువులు కలిసి దాడి చేశారని తెదేపా కార్యకర్త కానిశెట్టి నాగులు వాపోయారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
    ఎన్టీఆర్​ జిల్లా విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. నూజివీడుకు చెందిన బాలికకు బెంగళూరు వాసి ఆంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికా నిఘా సంస్థ తొలి సీటీఓగా భారత సంతతి వ్యక్తి
    Nand Mulchandani: అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ-సీఐఏలో తొలి ముఖ్య సాంకేతిక అధికారిగా భారత సంతతికి చెందిన నంద్​ మూల్​చందనీ నియమితులయ్యారు. ఇది గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సీఐఏలోని సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
    INDIA COVID CASES: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,157 కేసులు నమోదయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జర్మనీకి మోదీ.. ఐరోపా టూర్ షురూ
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరోపా పర్యటన ప్రారంభమైంది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన మోదీ.. జర్మనీలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ ఛాన్స్​లర్ షోల్జ్​తో మోదీ భేటీ కానున్నారు. అనంతరం వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏప్రిల్​లో వాహన విక్రయాలు డీలా.. సరఫరాలో ఇక్కట్లు!
    Maruti Suzuki news: దేశీయ దిగ్గజ వాహన సంస్థ మారుతీ సుజుకీ వాహన టోకు విక్రయాలు ఏప్రిల్​లో 7 శాతం తగ్గాయి. సరఫరా అంతరాయాలతో ఉత్పత్తి సమస్యలు ఎదురు కావడం వల్ల మారుతీతో పాటు హ్యుందాయ్‌ మోటార్‌లు తమ ప్లాంట్ల నుంచి డీలర్లకు వాహన సరఫరాలు గత నెలలో తగ్గించాయి. అయితే టాటా మోటార్స్, టయోటా, స్కోడా ఆటో వంటి సంస్థలు గణనీయ వృద్ధి నమోదు చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉమ్రాన్​ @154 కి.మీ.. సచిన్​ రికార్డును సమం చేసిన రుతురాజ్​
    IPL 2022 CSK VS SRH: ఆదివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​-చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ క్రికెట్​ స్టేడియం నిర్మించనున్న షారుక్​ ఖాన్​!
    Sharukh khan stadium: అమెరికన్​ క్రికెట్​ లీగ్​లో భాగస్వామ్యమైన బాలీవుడ్ స్టార్​ షారుక్ ఖాన్​కు చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ నైట్ రైడర్స్.. ఇప్పుడు యూఎస్​ఏలో ఓ భారీ స్డేడియాన్ని నిర్మించబోతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.