ETV Bharat / city

Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

author img

By

Published : May 2, 2022, 9:25 AM IST

Updated : May 2, 2022, 11:39 AM IST

boy kidnap in tirumala
తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

09:23 May 02

గోవర్దన్‌ రాయల్‌ను ఎత్తుకెళ్లిన మహిళ

తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ రాయల్‌ను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా.. ఆదివారం ఉదయం 5.45 గంటలకు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాలుడిని కిడ్నాప్‌ చేసి ఆర్టీసీ బస్సులో మహిళ తిరుపతి వచ్చినట్లు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఏపీ03 జడ్‌ 0300 బస్సులో మహిళ ప్రయాణించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా

Last Updated : May 2, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.