ETV Bharat / sports

భారీ క్రికెట్​ స్టేడియం నిర్మించనున్న షారుక్​ ఖాన్​!

author img

By

Published : May 2, 2022, 9:01 AM IST

Sharukh khan stadium: అమెరికన్​ క్రికెట్​ లీగ్​లో భాగస్వామ్యమైన బాలీవుడ్ స్టార్​ షారుక్ ఖాన్​కు చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ నైట్ రైడర్స్.. ఇప్పుడు యూఎస్​ఏలో ఓ భారీ స్డేడియాన్ని నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

sharukh stadium
షారుక్ స్డేడియం

Sharukh khan stadium: బాలీవుడ్​ స్టార్​ హీరో, ఐపీఎల్​ కోల్​కతా నైట్​ రైడర్స్​ యజమాని షారుక్​ ఖాన్​ అమెరికాలోని లాస్​ ఏంజెల్స్​లో పెద్ద క్రికెట్​ స్డేడియం నిర్మించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యూఎస్​లోని మేజర్​ లీగ్​ క్రికెట్​ టీ20తో(ఎంఎల్సీ) కలిసి బాద్​షాకు చెందిన కోల్​కతా నైట్ ​రైడర్స్ గ్రూప్​(కేఆర్జీ) దక్షిణా క్యాలిఫోర్నియాలో భారీ వ్యయంతో వరల్డ్​ క్లాస్​ స్డేడియాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ఇంగ్లీష్​ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ మైదానం సీటింగ్ సామర్థ్యం గురించి వివరాలు తెలియలేదు.

దీని గురించి షారుక్​ మాట్లాడుతూ.. "రాబోయే కాలంలో అమెరికాలో క్రికెట్​ అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రయత్నం వల్ల మా నైట్​ రైడర్స్​కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. లాస్​ ఏంజెల్స్​కు సమీపంలో ఎంఎల్సీతో కలిసి అంతర్జాతీయ స్డేడియాన్ని నిర్మించాలని భావిస్తున్నాం" అని పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. కాగా, షారుక్​ చెందిన క్రికెట్​ ఫ్రాంచైజీ నైట్​ రైడర్స్​.. అమెరికన్​ టీ20 లీగ్​లో భాగస్వామి కానున్నట్లు గతంలోనే అమెరికన్​ క్రికెట్​ ఎంటర్​ప్రైజ్​ తెలిపింది. దానికి లాస్​ ఏంజెలిస్​ నైట్​ రైడర్స్​ అని నామకరణం కూడా చేశారు.

ఇదీ చూడండి: జడ్డూకు దాని గురించి ముందే తెలుసు.. అయినా..: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.