ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : May 2, 2022, 9:09 AM IST

Updated : May 2, 2022, 9:26 AM IST

INDIA COVID CASES: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,157 కేసులు నమోదయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID CASES
COVID CASES

Covid cases latest: దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య.. ఆదివారంతో పోలిస్తే కాస్త తగ్గింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా.. 3,157 పాజిటివ్‌లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క దిల్లీలోనే 1,485 కేసులు వచ్చినట్లు పేర్కొంది. ఈ కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 19,500కు పెరిగినట్టు వివరించింది. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా.. ఇప్పటివరకు 189 కోట్ల 23 లక్షల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

  • యాక్టివ్ కేసులు: 19,500
  • మొత్తం మరణాలు: 5,23,869
  • రికవరీలు: 4,25,38,976
  • మొత్తం కేసులు: 4,30,82,345

Covid cases around the world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ముందు రోజుతో పోలిస్తే లక్షకు పైగా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 2.92 లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. 923 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • ఇటలీలో అత్యధికంగా 40 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. 105 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 37,771 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 81 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 36,726 కేసులు బయటపడగా.. 32 మంది చనిపోయారు.
  • ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, అమెరికా దేశాల్లోనూ కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది.

ఇదీ చదవండి: అమానవీయం.. స్నేహితులతో కలిసి సొంత కుమార్తెపైనే..

Last Updated :May 2, 2022, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.