ETV Bharat / city

top news: ప్రధాన వార్తలు @ 11AM

author img

By

Published : Sep 6, 2021, 11:01 AM IST

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM

.

  • కొవిడ్‌ ఉత్పరివర్తనాల గుర్తింపునకు గుంటూరులో ప్రయోగశాల

గుంటూరు వైద్య కళాశాలలో కొవిడ్‌ ఉత్పరివర్తనాల గుర్తింపు కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చులు చేయనున్నారు. ఈ ప్రయోగశాల వల్ల వైరస్​లో కొత్త రకాలను సులువుగా గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పవన్​ కల్యాణ్​ను అభినందించిన తెలంగాణ గవర్నర్​

సినీనటుడు పవన్​ కల్యాణ్​ను తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రెండు లక్షలు సహాయం చేసి ఆదుకోవడం హర్షణీయమని ఆమె ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అక్కడ ధరలు పెరిగితే.. ఇక్కడున్న అన్నదాతపై అదనపు భారం!

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి సరకుల ధరలు పెరగడంతో... దేశీయ రైతులపై అదనంగా 30 శాతం భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీ భరించకుంటే... ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో తగ్గిన విద్యుదుత్పత్తి.. సర్దుబాటుకు ఇబ్బందులు

రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. జెన్‌కో నుంచి 57 ఎంయూలే విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉంటోంది. డిమాండ్‌ సర్దుబాటు కోసం రోజూ 25 ఎంయూల విద్యుత్​ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశంలో కొత్తగా 38వేల కేసులు, 43వేల రికవరీలు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 38,948 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 219 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'పాంచజన్య ఆర్​ఎస్​ఎస్ అధికార ప్రతినిధి కాదు'

ఆదాయపన్ను శాఖ రూపొందించిన పోర్టల్​లో సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తు ప్రచురించిన కథనంపై ఆర్​ఎస్​ఎస్​ వెనక్కి తగ్గింది. ఈ కథనం అనేది కేవలం రచయిత భావాన్ని వ్యక్తపరుస్తుందని ఆర్​ఎస్​ఎస్​ అఖిల భారత ప్రచారకర్త సునీల్​ అంబేకర్​ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వాతావరణ మార్పులపై పుస్తకం.. 10 ఏళ్ల బాలుడి ఘనత

చిన్న వయసులోనే పర్యావరణ ప్రాముఖ్యతను(climate change) తెలుసుకున్న ఓ బడతడు.. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 10 ఏళ్లకే ఏకంగా పుస్తకమే రాశాడు. ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో(india book of records) చోటు సంపాదించాడు. అతడే.. నాలుగో తరగతి చదువుతున్న శిరీష్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే!

అఫ్గాన్​లో నిండు గర్భిణి అయిన మహిళా పోలీస్​ను తాలిబన్లు కాల్చి చంపారని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ హత్యపై తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్​ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గోడను బాది, హెల్మెట్​ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా సారథి కోహ్లీ((kohli england tour 2021)అసహనానికి గురయ్యాడు. బలంగా గోడను బాదుతూ హెల్మెట్​ను పక్కకు విసిరాడు. ఆ వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పవన్​-హరీశ్​ సినిమా టైటిల్​ ఇదేనా?

హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో పపర్​స్టార్​ పవన్​కల్యాణ్​ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి ఓ స్వాతంత్య్ర సమరయోధుడి పేరును (pawan kalyan new movie title) పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేంటంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.