ETV Bharat / business

Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : దీపావళికి మంచి కారు కొనాలా?.. రూ.15 లక్షల బడ్జెట్​లో బెస్ట్ కార్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 3:26 PM IST

Updated : Oct 28, 2023, 3:32 PM IST

Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : ఈ దీపావళికి కొత్త కారు కొనాలనే ప్లానింగ్​లో ఉన్నారా? మీడియం బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న రూ.15 లక్షల బడ్జెట్​లోని బెస్ట్​ టర్బో పెట్రోల్​ పెర్ఫార్మెన్స్​ కార్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Petrol Cars Under 15 Lakhs
Top 5 turbo petrol cars

Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : పండగ సమయంలో చాలా మంది కొత్త కార్లు కొంటుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని పలు కార్ల కంపెనీలు.. ఇప్పటికే దీపావళి సేల్​ను ప్రారంభించాయి. పైగా భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. మీరు కూడా కారు కొనాలనే ప్లానింగ్​లో ఉన్నారా? అయితే రూ.15లక్షల బడ్జెట్​లోని బెస్ట్​ కార్లపై ఓ సారి లుక్కేద్దాం రండి.

హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్..
Hyundai I20 N Line : హ్యుందాయ్​ కంపెనీ ఈ కారును 2021లో మార్కెట్​లోకి విడుదల చేసింది. అనంతరం ఒక ఫేస్​లిఫ్ట్ మోడల్​ని కూడా కంపెనీ విడుదల చేసింది. హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్ కారు​ 1.0 లీటర్​ TGDi ఇంజిన్​ సామర్థ్యంతో రూపుదిద్దుకుంది. ఇది 118bhp పవర్​, 172Nm టార్క్​​ను జనరేట్​ చేస్తుంది. ఆరు మాన్యువల్ గేర్లు, ఏడు గేర్ల డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ యూనిట్.. ఇంజిన్​కి అనుసంధానంగా ఉంటాయి. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Hyundai I20 N Line Price : హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ కారు ధర రూ.9.99 లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

Hyundai I20 N Line
హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్

మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్..
Mahindra XUV300 TurboSport : ఈ కారు​ 2022 అక్టోబర్​లో మార్కెట్​లోకి విడుదలైంది. 1.2 లీటర్​ mStallion TGDi ఇంజిన్​ సామర్థ్యంతో ఈ కారు తయారు చేసింది మహీంద్రా కంపెనీ. ఈ ఇంజిన్​ 128bhp పవర్​, 250Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఆరు మాన్యువల్ గేర్లు ఈ ఇంజిన్​కు అనుసంధానమై ఉంటాయి. కేవలం 10.67 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్​ను ఈ కారు అందుకోగలదని సమాచారం. హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్​ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV300 TurboSport Price : మహీంద్రా ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్​ కారు ప్రారంభ ధర రూ.9.30 లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

Mahindra XUV300 TurboSport
మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్..
Hyundai Venue N Line : 1.0 లీటర్ త్రీ-సిలిండర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​​ను ఈ కారులో అమర్చారు. ఇది 118bhp పవర్, 172Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ కారు ఇంజిన్​కు ఆరు గేర్లు అనుసంధానమై ఉంటాయి. హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Hyundai Venue N Line Price : హ్యుందాయ్​ వెన్యూ ఎన్​ లైన్ కారు ధర రూ.12.08 లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

Hyundai Venue N Line
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్..

Tata Safari Petrol Version : 'టాటా' కొత్త ప్లాన్​.. సఫారీ, హారియర్​లో 'పెట్రోల్'​ ఇంజిన్.. ధరలు తగ్గుతాయా?

మారుతి సుజుకి ఫ్రాంక్స్​..
Maruti Suzuki Fronx : ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్​ కారులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్​​ అమర్చారు. ఇది 99bhp పవర్​, 147Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంజిన్​కు ఐదు మాన్యువల్ గేర్లు, ఆరు ఆటోమెటిక్​ గేర్లు అనుసంధానమై ఉంటాయి.

Maruti Suzuki Fronx Price : మారుతి సుజుకి ఫ్రాంక్స్​ కారు ధర రూ.9.72 లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

Maruti Suzuki Fronx
మారుతి సుజుకి ఫ్రాంక్స్​

సిట్రోయెన్ C3..
Citroen C3 : 1.2 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో​ పెట్రోల్ ఇంజిన్​​ సామర్థ్యంతో సిట్రోయెన్​ కారు రూపుదిద్దుకుంది. ఈ ఇంజిన్​ 109 bhp పవర్​, 190Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్​తో ఆరు మాన్యువల్ గేర్లు అనుసంధానమై ఉంటాయి.

Citroen C3 Price : సిట్రోయెన్ C3​ ధర రూ.8.28 లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

Citroen C3
సిట్రోయెన్ C3

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

Maruti Suzuki Swift Unveiled : 40 కి.మీ మైలేజ్​తో నయా మారుతి స్విఫ్ట్.. టోక్యో మోటార్​షోలో అన్​వీల్​!

Last Updated : Oct 28, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.