ETV Bharat / business

Mahendra Car Discounts In October 2023 : పండగకు కొత్త కారు కొనాలా?.. మహీంద్రా కార్లపై రూ.1.25 లక్షల డిస్కౌంట్​.. ఉచిత యాక్సెసరీస్​ కూడా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 1:50 PM IST

Mahendra Car Discounts In October 2023 : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా.. అక్టోబర్​ నెలలో తమ బ్రాండెడ్​ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్​లను ఇస్తోంది. పలు కార్లను ఏకంగా రూ.1.25 లక్షల డిస్కౌంట్​తో అందిస్తోంది. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

Mahendra Car Discounts In October 2023
అక్టోబర్ 2023లో మహేంద్ర కార్లపై డిస్కౌంట్​

Mahendra Car Discounts In October 2023 : భారత్​కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా.. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లను ప్రకటించింది. వివిధ మోడళ్లపై దాదాపు రూ.1.25లక్షల వరకు డిస్కౌంట్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2023 అక్టోబర్​లో మాత్రమే ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మహీంద్రా XUV300, మహీంద్రా XUV400, మహీంద్రా మరాజ్జో, మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో.. వాహనాలపై ఈ ఆఫర్స్​​ అందిస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. అందుకే వీటిపై ఓ లుక్కేద్దాం రండి.

మహీంద్రా XUV300..
Mahindra XUV 300 : ఈ మోడల్​ వాహనంపై రూ.90,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది మహీంద్రా కంపెనీ. పెట్రోల్​ ఇంకా డీజిల్​ వాహనాలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే ఇది ఫ్లాట్​ డిస్కౌంట్​ కాదని.. క్యాష్ డిస్కౌంట్​​, యాక్ససరీస్​ రూపంలో ఈ తగ్గింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం న్యూ మహీంద్రా XUV300.. వివిధ వేరియంట్ల ప్రారంభ ధర రూ.7.99లక్షలుగా (ఎక్స్​షోరూం)ఉంది. గరిష్ఠ ధర రూ.10.21 లక్షలు వరకు ఉంది.

Mahendra Car Discounts In October 2023
మహీంద్రా XUV300..

మహీంద్రా XUV400
Mahindra XUV 400 : మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వెహికల్.​ ఈ మోడల్​పై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్​ను అందిస్తోంది కంపెనీ. ఇందులో భాగంగానే ఈఎస్​సీ వేరియంట్లపై రూ.50,000 వరకు క్యాష్​ డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రారంభ ధర దాదాపు రూ.16లక్షలు. ఈ కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 375కి.మీ రేంజ్ వస్తుంది. ఈ కారు హై-ఎండ్ మోడల్​​​ 456 కి.మీ రేంజ్​ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Mahendra Car Discounts In October 2023
మహీంద్రా XUV400..

మహీంద్రా మరాజ్జో..
Mahindra Marazzo : ఈ మోడల్​ కార్లలోని అన్ని వేరియంట్లపై రూ.73,000 వరకు డిస్కౌంట్​ను అందిస్తోంది మహీంద్రా. ఈ ఆఫర్​ కేవలం 2023 అక్టోబర్​ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. మహీంద్రా మరాజ్జో వెహికల్​​ ప్రారంభ ధర రూ.14.10లక్షలుగా (ఎక్స్​షోరూం) ఉంది.

Mahendra Car Discounts In October 2023
మహీంద్రా మరాజ్జో..

మహీంద్రా బొలెరో..
Mahindra Bolero : మహీంద్రా బొలెరో మోడల్​పై రూ.70,000 వరకు డిస్కౌంట్​ను ప్రకటించింది మహీంద్రా. అయితే ఈ డిస్కౌంట్ ఆయా వేరియంట్​లను అనుసరించి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మహీంద్రా బొలెరో మోడల్​పై రూ.15,000 క్యాష్​ డిస్కౌంట్​గా ఇస్తోంది కంపెనీ. అలాగే B6, B6 (O) వేరియంట్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్​ను ఇవ్వనున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్​తో పాటు దాదాపు రూ.20,000 విలువైన ఉచిత యాక్ససరీస్​ను కూడా కొనుగోలుదారులకు అందిస్తారు. బొలెరో క్లాసిక్​ ప్రారంభ ధర రూ.9.79లక్షలు.

Mahendra Car Discounts In October 2023
మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో నియో
Mahindra Bolero Neo : బొలెరో నియోపై రూ.50,000వరకు డిస్కౌంట్​ను పొందొచ్చు. నియో ఎన్4 వేరియంట్​పై​ రూ.5000, నియో ఎన్8 వేరియంట్​పై రూ.11,000 వరకు డిస్కౌంట్​ను అందిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. అదే విధంగా ఎన్​10, ఎన్10(O) వేరియంట్లపై రూ.30,000 వరకు తగ్గింపులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. బొలెరో నియో వాహనాల ప్రారంభ ధర రూ.13.99లక్షలుగా (ఎక్స్​షోరూం) ఉంది.

Mahendra Car Discounts In October 2023
మహీంద్రా బొలెరో నియో

వీటిపై నో డిస్కౌంట్స్ : మహేంద్ర కంపెనీ తమ పాప్యులర్​ ఎస్​యూవీలైన.. స్కార్పియో-ఎన్​, స్కార్పియో క్లాసిక్, ఎక్స్​యూవీ 700, థార్​ కార్లపై ప్రస్తుతానికి ఎలాంటి డిస్కౌంట్స్ అందించడంలేదు.

Cars Discounts In October 2023 : కొత్త కారు కొనాలా?.. ఆ కారుపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్​.. బెస్ట్ ఆఫర్స్​ కూడా!

2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్​తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.