ETV Bharat / business

మెటర్నిటీ బీమాతో ఆర్థిక రక్షణ- పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 2:26 PM IST

Maternity Insurance Benefits : వివాహం చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించిన దంపతులకు ఎదురయ్యే ఆర్థిక సమస్య మెటర్నిటీ ఖర్చులు. అప్పుడే జీవితంలో స్థిరపడుతున్న వీరికి ప్రసూతి ఖర్చులనేవి ఆర్థిక భారంగా ఉంటాయి. అయితే మెటర్నిటీ ఖర్చుల కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమాను తీసుకోవటం ద్వారా ఇంబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోవటంలో జాగ్రత్త వహించాలి.

Maternity Insurance Benefits
Maternity Insurance Benefits

Maternity Insurance Benefits : ఆస్పత్రి ఖర్చులకు పేదలే కాదు ధనికవర్గాలు సైతం హడలెత్తిపోతారు. జేబులు ఖాళీ అవ్వటం ఖాయమని ఆందోళన పడతారు. అందుకే ఈరోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్​లకు డిమాండ్ పెరిగింది. అయితే కొత్తగా పెళ్లైన దంపతులు అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడుతుంటారు. దీంతో వారికి ప్రసూతి సమయంలో అయ్యే ఖర్చులు ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. అందుకే మెటర్నిటీ కవరేజ్ ఉన్న మంచి ఆరోగ్య బీమాను తీసుకోవాలి. అందులో ప్రసవానంతర వైద్య ఖర్చులతో పాటు, నవజాత శిశువులకు చికిత్స ఉందా లేదా సరిచూసుకోవాలి. సరైన పాలసీని ఎంచుకోవడం వల్ల డెలివరీ సమయంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు దాదాపు అడ్డుకట్ట వేయవచ్చు.

Health Insurance Maternity Cover : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల సరోగసీ (అద్దె గర్భం), ఐవీఎఫ్ వైపు మళ్లే దంపతుల సంఖ్య సైతం పెరుగుతోంది. అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైంది. అందుకే చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం డెలివరీ కవరేజ్​ను మాత్రమే అందిస్తాయి. అందుకే మనం తీసుకునే ఆరోగ్య బీమాలో సరోగసీ, ఐవీఎఫ్​ వంటి పద్ధతులకు కూడా కవరేజ్ ఉండేలా చూసుకుంటే మరింత మంచిది.

పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
ఆస్పత్రి నెట్​వర్క్​
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మంచి పేరున్న ఆస్పత్రులు అందులో భాగంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మంచి ఆస్పత్రుల నెట్​వర్క్​ కలిగిన పాలసీలనే తీసుకోండి. దానివల్ల ప్రసూతి సమయంలో ఆస్పత్రిలో చేరటం తేలికవుతుంది.

వెయిటింగ్ పీరియడ్
Health Insurance Maternity Waiting Period : అదేవిధంగా బీమా కంపెనీ వెయిటింగ్ పీరియడ్​ను ఒకసారి గమనించండి. మీరు ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే కంపెనీ వెయిటింగ్ పీరియడ్ ఒకవేళ నాలుగేళ్లు ఉంటే, ఆ సమయంలో ప్రసూతి మీ ఇన్సూరెన్స్ చెల్లదు. కనుక ఈ విషయాన్ని సరిచూసుకుని పాలసీ తీసుకొండి. కొన్న ప్లాన్​లలో ఎన్ని ప్రెగ్నెన్సీలకు బీమా కవరేజ్​ వర్తిస్తుంది అనే దానిపై ప్రత్యేక నింబంధనలు ఉంటాయి.

నవజాత శిశువులకు కవరేజ్​
కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా కవరేజ్​ లభిస్తుంది. మీరు తీసుకునే పాలసీల్లో ఇలాంటి ఫీచర్ ఉందో లేదో సరిచూసుకోండి. ఇలాంటి ఫీచర్​ ఉంటే బిడ్డ పుట్టగానే అయ్యే మెడికల్ ఖర్చులు కవర్​ అవుతాయి.

ఒకసారి పాలసీ తీసుకునే ముందే కంపెనీ నియమనిబంధనలు పూర్తిగా తెలుసుకోండి. మీరు తీసుకునే పాలసీ మెటర్నిటీ విషయంలో సరైన ఆర్థిక రక్షణ ఇస్తుందా లేదా గమనించండి. సరైన పాలసీ మీకు ఆర్థిక రక్షణ అందించడమే కాకుండా మీ పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందనే విషయం గుర్తుంచుకోండి.

Pregnancy Tracker Apps : తల్లి కాబోతున్నారా?.. ఈ యాప్స్​తో మీ బిడ్డ ఎదుగుదలను చూసుకోండి!

Planning To Conceive : ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఆ మాత్రల విషయంలో జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.