ETV Bharat / business

Suzuki Grand Vitara Vs Kia Carens : సుజుకీ గ్రాండ్ విటారా Vs కియా కారెన్స్​.. ఫీచర్స్ చూశారా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 12:38 PM IST

Updated : Oct 6, 2023, 2:29 PM IST

Suzuki Grand Vitara Zeta CNG Vs Kia Carens Prestige Plus iMT : మీరు ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మార్కెట్​లోకి ప్రముఖ కార్ల సంస్థలు సుజుకీ, కియా ఇండియా సరికొత్త ఫీచర్స్​తో నయా ఫ్యామిలీ కార్లను ప్రవేశపెట్టాయి. మరి.. వాటి ప్రత్యేకతలు ఏంటో చూద్దామా..

Suzuki Grand Vitara Vs Kia Carens
Suzuki Grand Vitara Vs Kia Carens

Suzuki Grand Vitara Vs Kia Carens Prestige : "బైకు అంటే సౌకర్యం.. కారు అంటే విలాసం" అన్నట్టుగా ఉండేది గతంలో పరిస్థితి. కానీ.. కాలం మారింది. ద్విచక్రవాహనం ఏనాడో అత్యవసరంగా మారిపోగా.. కారు కూడా క్రమంగా విలాసపు మెట్టు దిగి.. సౌకర్యపు గీత దాటి.. "అవసరపు" మలుపు తీసుకుంటున్నది. చాలా మంది ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొనో.. మరో కారణం చేతనో.. కారు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ సంస్థలు.. రకరకాల ఫ్యామిలీ కార్లను మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన సుజికీ(Suzuki), కియా ఇండియాలు సరికొత్త ఫీచర్లతో ఫ్యామిలీ కార్లను తీసుకొచ్చాయి. మరి, వీటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..

Suzuki Grand Vitara Vs Kia Carens : ప్రస్తుతం మార్కెట్​లో సుజుకి గ్రాండ్ విటారా,కియా కారెన్స్(Kia Carens) ఫ్యామిలీ కార్ల కొనుగోలుదారులలో మంచి స్కోర్‌ను కలిగి ఉన్నాయి. ఇవి రెండూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆమోదయోగ్యమైన గ్లోబల్ NCAP రేటింగ్‌లతో బలమైన భద్రతను అందిస్తున్నాయి. ఇవి రెండూ రూ.15 లక్షలలోపు ధరను కలిగి ఉన్నాయి. వీటిలో విశాలమైన ఇంటీరియర్స్, రిక్లైనింగ్ రియర్ సీట్లు, కూలింగ్ గ్లోవ్‌బాక్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ సౌకర్యంగా ఉంటాయి. టచ్‌స్క్రీన్ సిస్టమ్, మల్టిపుల్ ఛార్జింగ్ పాయింట్స్, స్టీరింగ్ సర్దుబాటు సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇంకా డీటెయిల్​గా చూస్తే...

Upcoming Cars In India : రూ.15 లక్షల లోపు కారు కొనాలా? అప్​కమింగ్ టాప్​ 5 కార్లు ఇవే!

గ్రాండ్ విటారా జీటా CNG(Maruti Suzuki Grand Vitara Zeta CNG) :

గ్రాండ్ విటారా జీటా CNG వేరియంట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ABS, ట్రాక్షన్ కంట్రోల్, 4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ అందిస్తోంది.

265 లీటర్ల బూట్ స్పేస్, రిక్లైనింగ్ Rear సీట్లు కలిగి దూర ప్రయాణాలలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

వెనుక AC వెంట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉంది.

స్టీరింగ్ నియంత్రణ, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

మార్కెట్​లో 29 సెప్టెంబర్ 2023 నాటికి గ్రాండ్ విటారా జీటా CNG వేరియంట్ ధర రూ. 14,86,000గా ఉంది.

Upcoming EV SUV Cars In India 2023 : రూ.10లక్షల్లోపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కార్లు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 450కి.మీ. రేంజ్!​

కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ iMT(Kia Carens Prestige Plus iMT) :

కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

ABS, ESC, ISOFIX మౌంట్‌లు, బలమైన ప్రయాణీకుల రక్షణ కోసం 3-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ను అందజేస్తోంది.

పుష్కలమైన లెగ్‌రూమ్, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి.

రెండో, మూడో వరుసలకు అంకితమైన AC వెంట్‌లతో.. కుటుంబ సభ్యులందరికీ సౌకర్యంగా ఉంటుంది.

8-అంగుళాల టచ్‌స్క్రీన్, బహుళ ఛార్జింగ్ పాయింట్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ ఉన్నాయి.

పుష్-బటన్ స్టార్ట్, పాడిల్ షిఫ్టర్స్ రోజువారీ డ్రైవ్‌లను సులభతరం చేస్తాయి.

పొడవైన 2780mm వీల్‌బేస్‌తో మూడో వరుసలో కూడా సెగ్మెంట్-లీడింగ్ లెగ్‌రూమ్‌ను అందిస్తోంది.

సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు మెరుగైన హెడ్‌రూమ్ సౌలభ్యాన్ని అందిస్తాయి.

మార్కెట్​లో 29 సెప్టెంబర్ 2023 నాటికి దీని ధర రూ. 14,75,000గా ఉంది.

Upcoming Electric Cars In India : సింగిల్​​ ఛార్జ్​తో 550 కి.మీ జర్నీ​​.. ఫీచర్స్​ అదుర్స్​! టాప్​ 5 అప్​కమింగ్​ ఈవీ కార్స్​ ఇవే

Best Petrol Cars Under 10 Lakhs With Top Mileage : రూ.10 లక్షల్లోపు బెస్ట్ మైలేజ్​ కార్స్.. ఫీచర్స్ కూడా​ అదుర్స్​..!

Last Updated : Oct 6, 2023, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.