భారత్​లోనే అతి చౌకైన ఎలక్ట్రిక్​ కారు ఇదే! ధర, ఫీచర్స్ చూశారా?

author img

By

Published : Nov 16, 2022, 6:25 PM IST

Indias cheapest electric car

అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్​ కారు కొనాలనుకునే వారికి గుడ్​ న్యూస్​! ముంబయికి చెందిన ఓ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ రూ.5 లక్షలలోపే ఓ కారును తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ కారు ముందస్తు బుకింగ్​లు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది.

అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్​​ విద్యుత్​ కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఓ గుడ్​ న్యూస్​. ముంబయికి చెందిన ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ అయిన పీఎంవీ ఎలక్ట్రిక్​ సంస్థ రూ.5 లక్షల్లోనే ఓ మైక్రో​ కారును విడుదల చేసింది. ఈఏఎస్​-ఈ ఈవీ (EaS-E EV) పేరుతో తెచ్చిన ఈ కారు.. ఇద్దరు ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. భారత్​లోనే అతి చిన్న ఎలక్ట్రిక్​ కారు ఇదేనని పీఎంవీ తెలిపింది. ఈ మైక్రో కారు 36 చదరపు అడుగులు కలిగి ట్రాఫిక్​లో ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని వివరించింది. ఇప్ప‌టికే పీఎంవీ ఎల‌క్ట్రిక్ ముంద‌స్తు బుకింగ్స్ ప్రారంభించింది. ఆస‌క్తిగ‌ల వారు పీఎంవీ ఎల‌క్ట్రిక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.2,000 చెల్లించి కారును బుక్ చేసుకోవ‌చ్చని తెలిపింది. ప్రస్తుతానికి 6,000 మంది ముందస్తు బుకింగ్​లు చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈఏఎస్​-ఈ కారు 10కిలోవాట్స్​ సామ‌ర్థ్యంతో.. గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బ్యాట‌రీ పూర్తి చార్జింగ్ కావ‌డానికి దాదాపు నాలుగు గంట‌ల సమయం​ ప‌డుతుంది. 120 కి.మీ., 160కి.మీ., 200 కిలోమీటర్ల రేంజ్​తో కూడిన మూడు రకాల బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో కిలోమీటరు ప్రయాణానికి రూ.75 పైసలు ఖర్చు అవుతుంది.

Indias cheapest electric car
ఈఏఎస్​-ఈ ఈవీ కారు

రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్‌, రిమోట్ పార్కింగ్ అసిస్ట్‌, ఓటీఏ అప్‌డేట్స్‌, స్మార్ట్ ఫోన్ క‌నెక్టివిటీ వంటి ప‌లు స్మార్ట్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ కారును మీ స్మార్ట్‌ఫోన్‌తో క‌నెక్ట్ చేయ‌డం వల్ల దాని ఎయిర్ కండీష‌న్​ను, హార‌న్‌ను, విండోలు, లైట్స్‌ను రిమోట్ సాయంతో కంట్రోల్ చేయొచ్చు. నాలుగు డోర్లతో ఇద్ద‌రు మాత్ర‌మే కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ముందు డ్రైవ‌ర్ సీట్‌లో ఒక‌రు, వెనుక సీట్‌లో ఒక‌రు మాత్ర‌మే కూర్చోవ‌చ్చు. డ్రైవర్​ సీట్​కు పెద్ద కారు మాదిరి ఎయిర్​బ్యాగ్​ సదుపాయం కూడా ఉంది.
120 కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్యాటరీ కారును మొదటి 10,000 మంది కస్టమర్స్​కు రూ.4.79 లక్షలకు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కారును రూ.6.79 లక్షలకు.. 200 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కారును రూ.7.79 లక్షలకు విక్రయించనున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.