ETV Bharat / business

Travel in Third AC Class with Sleeper Ticket : వావ్.. సూపర్ స్కీమ్! స్లీపర్ క్లాస్ టికెట్‌తో.. ఫ్రీగా థర్డ్ ఏసీ జర్నీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 10:26 AM IST

Travel in Third AC Class with Sleeper Ticket : స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకొని.. అదే టికెట్‌తో థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తే అంతకన్నా ఏం కావాలి. ఈ అవకాశం కల్పిస్తోంది ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్. అసలు ఈ స్కీమ్​ ఏంటి..? అందుకు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

irctc train reservation
auto upgradation scheme in trains

IRCTC Auto Upgradation Scheme Details in Telugu: మరో నెలలో దసరా సెలవులు రాబోతున్నాయి. దీంతో చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా ట్రిప్​ ప్లాన్​ చేసుకుంటారు. ఇందుకోసం.. మెజారిటీ జనం ఎంచుకునే రవాణా సాధనం.. రైలు బండి. ముందే ప్లాన్​ చేసుకుంటే.. రైలు టికెట్ సులువుగానే దొరుకుతుంది. కానీ.. చివరి నిమిషంలో బుకింగ్ చేసుకునేవాళ్లకే టికెట్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ తప్పదు. అయితే.. ఆ టెన్షన్​ నుంచి IRCTC కాస్త రిలీఫ్​ ఇచ్చింది. ప్రయాణికులకు ఊరట కలిగించడానికి ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. మరి, ఈ స్కీమ్​ ఏంటి..? దీనివల్ల ఎవరికి లాభం..? నిబంధనలు ఏంటి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

How to Book IRCTC Tatkal Tickets : తత్కాల్ టికెట్లు.. ఎలా బుక్ చేయాలో తెలుసా..?

ఆటో అప్​గ్రేడేషన్​ అంటే..?
What is Auto Upgradation..?.. ఇప్పటి వరకూ.. రిజర్వేషన్ ద్వారా ప్రయాణికులు తాము ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ లభిస్తోంది. ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే.. రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఈ ఆటో అప్​గ్రేడేషన్​ ఫీచర్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ దొరక్కపోతే.. వారికి అంతకంటే పై కోచ్‌లో సీట్ లభిస్తుంది. అయితే.. ఇది జరగాలంటే.. రైలు టికెట్​ బుక్​ చేసుకునే ముందే.. మీరు ఆటో అప్​గ్రేడేషన్​ ఆప్షన్​ ఎంచుకోవాలి. దీనికి ఎలాంటి ఎక్ట్స్రా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!

ఉదాహరణకు ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్యాసింజర్​.. స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకున్నాడనుకోండి. ఆ బోగీలో అతడికి బెర్త్ ఖాళీ లేకపోతే.. థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ AC వారికి.. ఫస్ట్ AC వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ సౌకర్యం కేవలం ఆ పై బోగిల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లభిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా.. ఇప్పటి వరకూ.. చాలా మంది స్లీపర్ క్లాస్ రైలు టికెట్లతో.. థర్డ్ ఏసీలో ప్రయాణించారు! ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

ఐఆర్‌సీటీసీ ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్... నిబంధనలు ఇవే
IRCTC Auto Upgradation Scheme Conditions:

  • ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు 'ఆటో క్లాస్ అప్‌గ్రేడేషన్' ఆప్షన్ ఐఆర్‌సీటీసీ ఇస్తోంది.
  • టికెట్​ను బుక్​ చేసుకునే సమయంలోనే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • కన్సెషన్ టికెట్, సీనియర్ సిటిజన్లు, ఫ్రీ పాస్ హోల్డర్స్​కు ఈ స్కీమ్​ వర్తించదు.
  • రిజర్వేషన్ చార్ట్స్ సిద్ధం చేసే టైం లో ర్యాండమ్‌ పద్ధతిలో అప్‌గ్రేడేషన్ ఆటోమెటిక్‌గా జరుగుతుంది.
  • పై క్లాస్‌కు మాత్రమే అప్‌గ్రేడేషన్ వర్తిస్తుంది. అంటే స్లీపర్ క్లాస్ ఎంచుకున్నవాళ్లకు 3 ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • 3AC ఎంచుకున్నవారికి సెకండ్ ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • 2AC ఎంచుకున్నవారికి ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • వెయిటింగ్ లిస్ట్​లో ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ వర్తిస్తుంది.
  • ట్రైన్​లో వెయిటింగ్ లిస్ట్ లేకపోతే అప్‌గ్రేడేషన్ ఉండదు.
  • ఒకే పీఎన్ఆర్ కింద ఉన్న ప్రయాణికులందరి టికెట్లనూ ఒకేసారి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • క్లాస్ అప్‌గ్రేడ్ చేసినా పీఎన్ఆర్ నెంబర్ మారదు.
  • ఒకవేళ అప్‌గ్రేడ్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేస్తే ఒరిజినల్ క్లాస్‌ రీఫండ్ మాత్రమే వస్తుంది.
  • 2S, EC, CC లాంటి సిట్టింగ్ అకామడేషన్ ఉన్న రైళ్లకు ఆటో అప్‌గ్రేడేషన్ వర్తించదు.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.