ETV Bharat / business

రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్​ కేసులో ట్విస్ట్.. బ్యాన్​పై దిల్లీ హైకోర్టు స్టే

author img

By

Published : Jul 20, 2022, 1:13 PM IST

Service charge in restaurant: హోటల్స్, రెస్టారెంట్స్​లో బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నిబంధనలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. నవంబర్​ 25 వరకు సీసీపీఏ తెచ్చిన నిబంధనలను అమలు చేయరాదని స్పష్టం చేసింది.

Service charge in restaurant
Service charge in restaurant

Service charge in restaurant: హోటల్స్, రెస్టారెంట్స్​లో బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నిబంధనలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. జాతీయ రెస్టారెంట్ల సంఘం, జాతీయ హోటళ్ల సంఘం ఈ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్​ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నవంబర్​ 25 వరకు సీసీపీఏ తెచ్చిన నిబంధనలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల విధింపు విషయాన్ని మెనూలో, బహిరంగంగా ప్రదర్శించాలని.. టేక్​అవేపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని సూచించింది. వినియోగదారుడు ఛార్జీలు కట్టడానికి ఇష్టపడకపోతే.. రెస్టారెంట్​కు రావద్దని, అది అతడి ఎంపిక అని తెలిపింది.

అంతకుముందు జులై 4న హోటల్స్, రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా కీలక ఆదేశాలు వెలువడ్డాయి. బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్​ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది.

ఇవీ చదవండి: హోటల్స్, రెస్టారెంట్స్​ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్

'ప్రస్తుతం ట్రేడింగ్​లో లాభాలు కష్టమే.. ఆ వ్యూహం పాటించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.