ETV Bharat / business

గోల్డ్​లోన్​ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయంటే..

author img

By

Published : May 24, 2022, 6:00 PM IST

gold
gold

Gold loan interest rate: ఇటీవల కాలంలో గోల్డ్​ లోన్స్​కు ప్రాధాన్యం పెరిగింది. అత్యవసర రుణం కావాలంటే అదే మెరుగైన మార్గం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బ్యాంకులు, రుణ సంస్థల్లో ఎంత శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతాయి వంటి విషయాలు తెలుసుకుందాం.

Gold loan interest rate: రుణం తీసుకోవ‌డానికి బంగారం త‌న‌ఖా పెట్ట‌డం పాత కాలం నుంచి జ‌రుగుతున్నదే. బంగారు రుణాలు మ‌న దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రుణ‌ సౌక‌ర్యాల‌లో ఒక‌టి. వీటి వ‌డ్డీ.. వ్య‌క్తిగ‌త రుణ‌ వ‌డ్డీ కంటే త‌క్కువే ఉంటుంది. అత్య‌వ‌స‌ర రుణం కోసం బంగారంతో రుణం పొంద‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే సుల‌భ‌మైన మార్గం. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా రుణం మంజూరు చేస్తాయి.

పూర్వం ప్రైవేట్ వ్య‌క్తులు, చిన్న వ్యాపారులు బంగారాన్ని త‌న‌ఖా కింద పెట్టుకుని రుణాలిచ్చేవారు. బ్యాంకులు త‌క్కువ స్థాయిలోనే రుణాలిచ్చేవి. కాని ఇప్పుడు బంగారం త‌న‌ఖాపై రుణాలు ఇవ్వ‌డానికి బ్యాంకులు బాగా ఆస‌క్తి చూపుతున్నాయి. బంగారం మీద రుణాలు ఇచ్చే పెద్ద సంస్థ‌లు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఈ రుణాలు బ్యాంకుల్లో 7.39% వ‌డ్డీ రేటు నుంచి మొదల‌వుతున్నాయి. బంగారం హామి ఉంటుంది కాబ‌ట్టి త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి కూడా ఈ రుణాలు సుల‌భంగానే ల‌భిస్తాయి. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో రుణ‌దారుల‌ను ఆర్థిక ఇబ్బందుల నుండి ర‌క్షించ‌డ‌మే కాకుండా వారి ప్రణాలిక‌లకు అనుగుణంగా ముందుకు వెళ్ల‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

సాధార‌ణంగా బంగారం రుణాల‌లో తాక‌ట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ విలువ‌లో 75% వ‌ర‌కు రుణ సంస్థ‌లు రుణాన్ని ఇస్తున్నాయి. రుణం ఎంత వస్తుంది, వ‌డ్డీ వివ‌రాలు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, ఆల‌స్య రుసుముల గురించి వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వెబ్‌సైట్ల‌లో లోన్ తీసుకోవ‌డానికి ముందే వినియోగ‌దారులు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే 'రీ-పేమెంట్‌'లో ఆల‌స్యం కార‌ణంగా అద‌న‌పు జ‌రిమానాలు, విలువైన ఆస్తి (బంగారం)ని కోల్పేయే అవ‌కాశం ఉంది. బంగారు రుణాల‌ వ‌డ్డీ రేట్లు బ్యాంకుని బట్టి మారుతుంటాయి.

దేశంలోని కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థ‌లు ప్ర‌స్తుతం అందిస్తున్న బంగారు రుణాల‌పై వ‌డ్డీ రేట్లు ఈ క్రింది ప‌ట్టిక‌లో ఉన్నాయి. 2 సంవ‌త్స‌రాల కాలానికి, రూ. 2.50 ల‌క్ష‌ల రుణానికి సూచించే 'ఈఎంఐ' కింద ఉంది.

Gold loan interest rate
గోల్డ్​లోన్​ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయంటే..

గ‌మ‌నిక: ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజులు క‌ల‌ప‌లేదు. రుణ అర్హ‌త‌ల‌ను బ‌ట్టి బ్యాంకు వ‌డ్డీ రేట్లు మార‌వ‌చ్చు. ప‌ట్టిక‌లో సూచించిన విధంగానే కాకుండా మీ రుణ అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇంకా అధికంగా కూడా రుణం పొందొచ్చు.

  • ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

ఇదీ చూడండి : ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్​​.. 33 గంటలకు 10 లక్షల మంది నిరుపేదలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.