ETV Bharat / business

Online Car Insurance : ఆన్​లైన్​లో కార్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటే ఇన్ని లాభాలా!

author img

By

Published : Jul 24, 2023, 4:21 PM IST

Car Insurance Online : వెహికిల్​ ఇన్సూరెన్స్​.. ప్రస్తుత రోజుల్లో వాహన యజమాని వద్ద కచ్చితంగా ఉండాల్సిన పత్రం. ఎందుకంటే వాహనం అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురై దెబ్బతిన్నప్పుడు ఇది మనకు ఆర్థికంగా తోడ్పడుతుంది. కొందరు కారు బీమాను నేరుగా ఇన్సూరెన్స్​ కంపెనీల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తే.. మరి కొందరేమో ఆన్​లైన్​లోనే తీసుకుంటుంటారు. అయితే ఆఫ్​లైన్​తో పోలిస్తే ఆన్​లైన్​లో కారు ఇన్సూరెన్స్​ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా..?

Advantages Of Online Car Insurance
ఆన్​లైన్​లో కార్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటే ఇన్ని లాభాలా..

Online Car Insurance : ప్రతి వాహనదారుడి దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన పత్రాల్లో వాహన బీమా ఒకటి. ఇది వాహనం ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదానికి గురై దెబ్బతిన్నప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే వెహికిల్​ ఇన్సూరెన్స్​లలో ప్రధానంగా చెప్పుకోవాల్సిది కారు ఇన్సూరెన్స్​ కొనుగోళ్ల గురించి. ఈ కారు బీమాల విక్రయాలు మనకు ఆఫ్​లైన్​ లేదా ఆన్​లైన్​ పద్ధతిల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని కొనేందుకు కొందరు మార్కెట్​లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వెహికిల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. మరికొందరేమో ఆన్​లైన్​లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువశాతం ప్రజలు మాత్రం ఆన్​లైన్​ కంటే ఆఫ్​లైన్​లోనే బీమాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న అంశం కనక క్లిక్​ చేసేటప్పుడు తెలియకుండా ఏ చిన్న పొరపాటు చేసినా మనకే నష్టం అనే ధోరణిలో ఉండటమే ఆన్​లైన్​లో ఎక్కువగా బీమాలు కొనుగోలు చేయకపోవడానికి కారణమని అంటున్నారు వాహన బీమా ఏజెంట్లు. కానీ, ఆన్​లైన్​లో కారు ఇన్సూరెన్స్​లను కొనడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. అవి..

సౌకర్యవంతం..!
Online Car Insurance Benefits : ఆన్​లైన్​లో అనేక వాహన బీమా సంస్థలు వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్స్​తో కారు ఇన్సూరెన్స్​లను అందిస్తున్నాయి. అలా మార్కెట్​లో అందుబాటులో ఉండే రకరకాల పాలసీలను ఒకదానితో ఒకటి బేరీజు వేసుకొని మన ఆర్థిక శక్తిని బట్టి మనకి కావాల్సిన పాలసీని ఎంచుకునే వీలు ఆన్​లైన్​ విధానం కల్పిస్తుంది. మనకి కావాల్సిన సమయానికి వీటిని కొనుగోలు చేయవచ్చు.

సమయం ఆదా..!
Vehicle Insurance Benefits : ఇన్సూరెన్స్​ ఏజెంట్​ దగ్గరకు వెళ్లి బీమాను కొనుగోలు చేయడమంటే గంటల తరబడి మన సమయాన్ని వృథా చేసుకోవడమే. అదే ఆన్​లైన్​ విధానంలో కారు ఇన్సూరెన్స్​ తీసుకోవడం ద్వారా చాలా వరకు మన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మొబైల్​ ఫోన్​ కంటే ల్యాప్​టాప్​ను వినియోగిస్తే సులువుగా కొద్ది నిమిషాల్లోనే పని పూర్తవుతుంది.

ఆప్షన్స్​..!
కారు ఇన్సూరెన్స్​లకు సంబంధించి వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో అనేక రకాల ఆప్షన్​లు అందుబాటులో ఉంటాయి. వివిధ బీమా ఏజెంట్​లు అందించే కవరేజీ, ప్రీమియం చెల్లింపులతో పాటు అదనపు సేవలను కూడా ఇతర కంపెనీలతో కంపేర్​ చేసుకొని మనకు ఉపయోగపడే బీమాను ఎంచుకోవచ్చు. అలా వివిధ కంపెనీలు అందించే ప్లాన్​లు కొనాలా.. వద్దా అనే పూర్తి అధికారం మనకే ఉంటుంది.

పూర్తి పారదర్శకత..!
Online Insurance Benefits : కారు బీమాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల పాలసీ వివరాలతో పాటు ధరలోనూ పారదర్శకత ఉంటుంది. ఈ విధానం వాహన బీమాకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆన్​లైలోనే నమోదు చేసుకుంటాయి. దీనితో మనకి కావాల్సినప్పుడల్లా వాటిని సులభంగా యాక్సెస్​ చేసుకోవచ్చు. కవరేజ్​ ఆప్షన్​, పాలసీ మినహాయింపులు సహా ఇతర వివరాలు ఆన్​లైన్​లో స్పష్టంగా ఉంటాయి. ఈ వివరాలు మీకు బీమా ప్లాన్​ను మార్చుకునేందుకు కూడా ఉపయోగపడతాయి.

కస్టమైజేషన్​..!
ఆన్​లైన్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ విధానంలో కస్టమైజేషన్ వినియోగదారుడికి ప్రధానమైన లాభంగా చెప్పొచ్చు. ప్రస్తుంత మార్కెట్​లో బీమా కంపెనీలు కారు ఓనర్​కు కావాల్సిన విధంగా పాలసీ ప్లాన్​లను రూపొందించి విక్రయిస్తున్నాయి. పాలసీ ఫీచర్‌లలో మార్పులు, తగ్గింపులు, యాడ్​-ఆన్​లు సహా ఇతర అంశాలను కస్టమర్​కు అనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశాన్ని కూడా బీమా కంపెనీలు ఆఫర్​ చేస్తున్నాయి. దీంతో మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మరీ కవరేజీని మార్చుకునే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది.

నిమిషాల్లో పాలసీ జారీ..!
Online Car Insurance Renewal : ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ సంస్థలు మీరు అందించే సమాచారం ఆధారంగా కొటేషన్​లను కూడా అందిస్తాయి. దీంతో మీరు పలు కంపెనీలు ఇచ్చిన కోట్​లను సరిపోల్చవచ్చు. అలా మీకు అనుగుణంగా ఉన్న ప్లాన్​ను ఎంచుకున్న తర్వాత నిమిషాల నుంచి గంటల వ్యవధిలోనే మీకు ఆ పాలసీని జారీ చేస్తుంది ఆన్​లైన్​ కారు ఇన్సూరెన్స్​ వ్యవస్థ. అలాగే అత్యవసర సమయాల్లోనూ టైమ్, పాలసీ రిన్యూవల్​తో పాటు కొత్త వాహనం కొనుగోలు చేసే విషయంలోనూ ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పత్రాలు పొందేందుకు వీలు ఆన్​లైన్​లో ఉంటుంది.

సులభంగా వివరాల అప్‌డేట్​..!
మీరు ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్​లను కొనుగోలు చేయడం ద్వారా మీ పాలసీని సులభంగా పర్యవేక్షించవచ్చు లేదా నిర్వహించవచ్చు. ఆ పత్రాలను మీరు సులభంగా యాక్సెస్ చేయడమే కాకుండా వ్యక్తిగత వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే కవరేజీలో మార్పులు, పాలసీ రిన్యూవల్​ వంటివి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.