ETV Bharat / business

Best 5 Saving Schemes for Senior Citizens : వృద్ధాప్యంలో లాభాలు తెచ్చే.. సూపర్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 11:31 AM IST

Senior Citizens Best 5 Saving Schemes : ఎవరికైనా సరే.. వృద్ధాప్యం శాపంగా మారకూడదు అనుకుంటే, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదు. దానికోసం ఇప్పట్నుంచే పొదుపు చేయాల్సిన అవసరం ఉందంటారు నిపుణులు. సీనియర్ సిటిజన్స్​ కోసం.. ప్రస్తుత మార్కెట్​లో ఉన్న ది బెస్ట్ స్కీమ్స్ తో మీ ముందుకు వచ్చాం. మరి, అవేంటో చూద్దామా..

Best 5 Saving Schemes for Senior Citizens
Saving Schemes for Senior Citizens

Best 5 Saving Schemes for Senior Citizens in Telugu : సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు నెల‌వారీ ఖ‌ర్చుల‌కు డబ్బు అత్యవసరం. వృద్ధాప్యంలో ఆదాయం ఆగిపోతుంది. ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకూడదు అనుకుంటే.. ఎంతో కొంత సేవింగ్స్(Saving Schemes) తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే.. వృద్ధులు రిస్క్‌తో కూడిన పెట్టుబడులకంటే.. సురక్షితమైన ఇన్వెస్ట్​మెంట్లనే కోరుకుంటారు. వారికొచ్చే ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ, ఇత‌ర ప‌థ‌కాల్లో సంపాదించిన పొదుపును వారి వ‌య‌స్సు రీత్యా రిస్క్‌ లేని ప్ర‌భుత్వ ఆర్థిక సంస్థ‌ల్లోనే పొదుపు చేయాలని సీనియర్ సిటిజన్స్ చూస్తారు. అదే విధంగా వారు పెట్టే పెట్టుబడులకు తప్పనిసరిగా హామీ ఉండడంతో పాటు క్రమం తప్పకుండా ఆదాయాన్ని కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుత మార్కెట్​లో అనేక రకాల పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిలో వృద్ధులకు(Best Old Age Schemes) తప్పనిసరిగా హామీ ఇచ్చే 5 ఉత్తమ పథకాలను మీ ముందుకు తీసుకువచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) : ఈ స్కీమ్ పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కం. దీనిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా సీనియ‌ర్ సిటిజ‌న్లు ప్ర‌తి 3 నెల‌ల‌కోసారి వ‌డ్డీ పొందొచ్చు. ప్ర‌స్తుతం దీంట్లో వార్షిక వ‌డ్డీ రేటు 8.2% ఉంది. త్రైమాసిక ప్రాతిప‌దిక‌న ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ సేవింగ్ స్కీమ్ సరిపోతుంది.

పేరులో ఉన్న‌ట్లుగానే ఈ స్కీమ్ సీనియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా ముందుగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారికి మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీసు లేదా బ్యాంకు ద్వారా దీనిలో చేర‌వచ్చు. ఎస్​సీఎస్ఎస్​(సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్) కాల వ్య‌వ‌ధి 5 ఏళ్లు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ పూర్తయిన అయిన త‌ర్వాత దీనిని 3 ఏళ్ల పాటు పొడిగించ‌వ‌చ్చు. అలాగే మ‌ధ్య‌లో ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

ఈ పథకం ఒకేసారి పెట్టుబ‌డి పెట్టే సింగిల్ ప్రీమియం డిపాజిట్‌. దీనిలో ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ క‌నీసం రూ.1000.. గరిష్ఠంగా రూ.15 ల‌క్ష‌లు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. అలాగే ఈ పథకంలో పెట్టుబ‌డులకు 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

2. ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న (Pradhan Mantri Vaya Vandana Yojana) : ఈ స్కీమ్ ఎల్ఐసీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోంది. దీనిలో 60 సంవ‌త్స‌రాలు దాటిన‌వారు ఒకేసారి గ‌రిష్ఠంగా 15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. అదేవిధంగా భార్యాభ‌ర్త‌లు ఈ స్కీమ్​లో చేరితే గ‌రిష్ఠంగా రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఇది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్​ఆర్​ఐలకు వర్తించదు.

ఇందులో వ‌డ్డీని నెల‌వారీ, త్రైమాసికం, అర్ధ సంవ‌త్స‌రం, వార్షికంగా కూడా పొందొచ్చు. దీని పెట్టుబడి కాలం 10 ఏళ్లు. ఆ తర్వాతే వడ్డీ పొందొచ్చు. ప్ర‌స్తుతం ఇందులో వ‌డ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. క‌నీస పెన్ష‌న్ రూ.1,000 తీసుకోవాలంటే.. ఈ స్కీమ్​లో రూ.1,62,162 చెల్లించాలి. అలాగే ఒకేసారి రూ.15 ల‌క్ష‌లు చెల్లించిన వారికి రూ.9,250 నెలవారీ పెన్షన్‌ వ‌స్తుంది. ఈ స్కీమ్ ప‌న్ను ఆదా ప‌థ‌కం కాదు. దీనిలో వడ్డీ పై స్లాబు ప్రకారం ప‌న్ను విధిస్తారు. పెట్టుబడిపై కూడా పన్ను మినహాయింపు లేదు.

How To Choose Best Pension Plan For Retirement : రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలా?.. సరైన పింఛన్​ ప్లాన్​ రెడీ చేసుకోండిలా!

3. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Senior Citizen Fixed Deposits) : సీనియర్ సిటిజన్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) కింద సాధారణ వడ్డీ కంటే కొంత ఎక్కువ మొత్తం వడ్డీ పొందుతారు. భద్రత పరంగా వృద్ధులకు ఈ స్కీమ్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన భారతీయులు, ఎన్​ఆర్​ఐలు దీంట్లో చేరవచ్చు. కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు 55 ఏళ్లు పైబడిన వారిని అనుమతిస్తాయి. వీరు తమకు నచ్చిన బ్యాంకులో ఆన్​లైన్​లో రూ.5,000 కనీస పెట్టుబడితో ఎఫ్​డీ ఓపెన్​ చేయవచ్చు. అదే బ్యాంక్ బ్రాంచ్​లో అయితే రూ. 10,000లతో దీనిలో చేరవచ్చు. గరిష్ఠ పరిమితి రూ.2 కోట్లకు మించకూడదు.

అయితే మీరు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను విశ్లేషించడం ద్వారా ఉత్తమ FD ఎంపికను ఎంచుకోవచ్చు. ప్ర‌స్తుతం పేరున్న కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 6 శాతం వ‌ర‌కు నెల‌వారీ వ‌డ్డీ ఇస్తున్నాయి. అన్ని బ్యాంకుల్లో ఈ వ‌డ్డీ రేట్లు ఒకేలా ఉండ‌వు. బ్యాంకుకి బ్యాంకుకి మార‌తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ వ‌డ్డీ రేట్లు 7% కూడా ఉంటాయి. అలాగే, కొన్ని బ్యాంకులు ప్ర‌త్యేక డిపాజిట్ల‌పై నిర్దిష్ట కాల‌వ్య‌వ‌ధికి ఎక్కువ వ‌డ్డీని అందిస్తాయి. ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు అయితే, 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో ఉంటాయి. సెక్ష‌న్ 80సి కింద పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

4. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం(Post Office Monthly Income Scheme) : పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో హామీతో కూడిన నెల‌వారీ ఆదాయాన్ని పొందొచ్చు. ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఈ స్కీమ్ చిన్న పొదుపు పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో ఒక‌టి. ఇందులో క‌నీసం రూ.1,000 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక అకౌంట్​లో గ‌రిష్ఠంగా రూ.4.50 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి అకౌంట్​లో రూ.9 ల‌క్ష‌లు గ‌రిష్ఠంగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇందులో సంవ‌త్స‌రానికి ల‌భించే వ‌డ్డీ రేటు 6.60%. ఈ స్కీమ్​లో ప్ర‌తి నెలా వ‌డ్డీ వ‌స్తుంది. వ‌డ్డీ రేటు మొత్తం కాల వ్య‌వ‌ధికి స్థిరంగా ఉంటుంది.

ఈ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ్య‌ధితో వ‌స్తుంది. పెట్టుబ‌డి మెచ్యూర్ అయిన త‌ర్వాత నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. లేదా తిరిగి మరల పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టిన మొద‌టి నెల నుంచి చెల్లింపును అందుకుంటారు. ఈ ప‌థ‌కం రాబడి ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. పెట్టుబ‌డులు సెక్ష‌న్ 80సి కింద‌కు రావు.

రిటైర్​ అయ్యాక నెలకు రూ.10వేలు పింఛను- ఇలా చేస్తేనే...

5. జాతీయ పెన్షన్ ప్లాన్(National Pension Plan) : ఈ పథకం ప్రభుత్వ, వాణిజ్య రంగాలకు చెందిన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. వారు తమ పదవీ విరమణ తర్వాత దాని ప్రయోజనాలను ఆస్వాదించడానికి పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు. అలాగే పదవీ విరమణ తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ఈ ప్లాన్ అనుమతిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా పింఛనుగా చెల్లిస్తారు. ఈ పథకం మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. అయితే, ప్రస్తుతం దేశంలోని నివాసితులందరూ ఈ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Small Saving Schemes Revised Interest Rates 2023 : పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? వడ్డీరేట్లు చూసుకున్నారా..?

FD Vs NSC : ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్.. దేంట్లో రాబడి ఎక్కువ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.