రూ.2000 నోట్లు ఉపసంహరణ.. మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు

author img

By

Published : May 19, 2023, 6:57 PM IST

Updated : May 19, 2023, 8:37 PM IST

2000 rupees note withdrawn

18:53 May 19

రూ.2000 నోట్లు ఉపసంహరణ.. రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం

2000 rupees note withdrawn : రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కులేషన్​లో ఉన్నవాటన్నింటినీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అయితే.. ఒక్కోసారి రూ.20వేలు విలువైన పెద్ద నోట్లను మాత్రమే బ్యాంకుల్లో వేరే నోట్లతో మార్చుకోవచ్చని తెలిపింది. ఇందుకు అన్ని బ్యాంకులు అవకాశం కల్పించాలని సూచించింది. రిజర్వు బ్యాంకుకు దేశంలోని వేర్వోరు చోట్ల ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2000 నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఎవరికీ రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది ఆర్​బీఐ.

భారతీయ రిజర్వు బ్యాంకు 2016 నవంబర్​లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి.. రూ.2000 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చింది. ఇతర డినామినేషన్ నోట్లు సరిపడా చలామణీలోకి వచ్చాయని నిర్ధరించుకున్న తర్వాత.. 2018-19లో పెద్ద నోట్ల ముద్రణను నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న 2000 రూపాయల నోట్లలో దాదాపు 89శాతం 2017 మార్చికన్నా ముందు జారీ చేసినవే. వాటి జీవితకాలం (4.5 ఏళ్లు) చివరకు చేరుకుందని రిజర్వు బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

అదే సమయంలో.. రూ.2000 నోట్ల చలామణీ కూడా గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2018 మార్చి 31న గరిష్ఠంగా రూ.6.73లక్షల కోట్లు విలువైన రూ.2000 నోట్లు సర్కులేషన్​లో ఉండగా.. 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62లక్షల కోట్లకు పడిపోయిందని వివరించింది. పెద్ద నోట్లతో లావాదేవీలు ప్రజలు పెద్దగా మొగ్గుచూపడం లేదని.. ఇతర డినామినేషన్​ నోట్లే సరిపోతాయని ఓ అంచనాకు వచ్చినట్లు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. వీటన్నింటి దృష్ట్యా.. ''క్లీన్​ నోట్ పాలసీ"లో భాగంగా రూ.2000నోట్లు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. 2013-14లోనూ ఇలానే చేసినట్లు గుర్తు చేసింది.

ఆర్​బీఐ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్‌
మరోవైపు రూ.2వేల నోట్ల ఉపసంహరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగింది కాంగ్రెస్​. రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఆర్​బీఐ తీరును తప్పుబట్టింది. రూ.2వేల నోటు తీసుకురావడమే తప్పని.. తప్పులు చేసి తలపట్టుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని ఆరోపించింది.

ఇవీ చదవండి : Credit card Tcs India : క్రెడిట్​ కార్డ్​కు కొత్త రూల్స్​.. అలా వాడితే ఇకపై 20% ట్యాక్స్​​!

రూ.2 లక్షల ప్రమాద బీమా రూ.20కే.. అర్హులెవరు? ఎలా చేరాలో తెలుసా?

Last Updated :May 19, 2023, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.